సమావేశాల్లోపే ఆ ముగ్గురిపై వేటు

Three MLAs in the Legislative Council disqualified - Sakshi

ముగిసిన ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌ విచారణ

తీర్పును రిజర్వులో పెట్టిన చైర్మన్‌ స్వామిగౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలిలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు ఖాయంగా కనిపిస్తోంది. సమావేశాలు మొదలయ్యేలోపే దీనిపై చైర్మన్‌ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జనవరి 19న శాసనçసభ, శాసనమండలి సంయుక్త సమావేశం జరగనుంది. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు రాములునాయక్, కె.యాదవరెడ్డి, ఆర్‌. భూపతిరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని టీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. రాములు నాయక్‌ వ్యవహారంపై విచారణ పూర్తయ్యింది. కె.యాదవరెడ్డి, ఆర్‌.భూపతిరెడ్డి తరఫున న్యాయవాదులు శనివారం శాసనమండలికి వచ్చా రు. చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌ వద్ద జరిగిన విచారణలో వాదనలు వినిపించారు. వాటిని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలను నమోదు చేసుకున్న చైర్మన్‌ స్వామిగౌడ్‌ తీర్పులను రిజర్వులో పెట్టారు.

నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం: పల్లా 
టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటిం చాలని ఫిర్యాదు చేశామని, చైర్మన్‌ తీర్పు కోసం వేచి చూస్తున్నామని శాసనమండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీలపై విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాం గ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్‌కు ఫిర్యాదుచేశాం. కొండా మురళీధర్‌రావు రాజీనామా చేశారు. రాములునాయ క్, భూపతిరెడ్డి, యాదవరెడ్డిల అనర్హత పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. వారిపై చట్ట ప్రకారం చర్య లు తీసుకోవాలని చైర్మన్‌ను కోరాం’ అని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top