బస్సు- వ్యాన్ ఢీ.. ముగ్గురి మృతి | Three killed in van - bus collided | Sakshi
Sakshi News home page

బస్సు- వ్యాన్ ఢీ.. ముగ్గురి మృతి

Nov 29 2015 4:01 PM | Updated on Sep 4 2018 5:07 PM

బస్సు- వ్యాన్ ఢీ.. ముగ్గురి మృతి - Sakshi

బస్సు- వ్యాన్ ఢీ.. ముగ్గురి మృతి

ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, వ్యాను ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా రఘునాథ్‌పల్లి మండలం గోవర్దనగిరి బస్టాండ్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న వరంగల్ 1 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది.

దీంతో వ్యానులో ఉన్న ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి త రలించి పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వారిలో ఒకరు వరంగల్ మట్టెవాడకు చెందిన గోవర్ధన్ కాగా.. మరో ఇద్దరు మహిళల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement