నన్నపునేని ప్రస్థానం ఇదీ.. | This nannapuneni career .. | Sakshi
Sakshi News home page

నన్నపునేని ప్రస్థానం ఇదీ..

Mar 15 2016 1:32 AM | Updated on Aug 15 2018 5:57 PM

నన్నపునేని ప్రస్థానం ఇదీ.. - Sakshi

నన్నపునేని ప్రస్థానం ఇదీ..

వరంగల్‌లోని కల్పలత కోఆపరేటివ్ డెరైక్టర్‌గా 1993లో నన్నపునేని నరేందర్ ఇండిపెండింట్ పోటీ చేసి ఎన్నికయ్యారు.

సూపర్‌బజార్ డెరైక్టర్ నుంచి మొదలు...

వరంగల్‌లోని కల్పలత కోఆపరేటివ్ డెరైక్టర్‌గా 1993లో నన్నపునేని నరేందర్ ఇండిపెండింట్ పోటీ చేసి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1995లో టీడీపీలో చేరిన ఆయన 1997లో అప్పటి 41వ డివిజన్ టీడీపీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1999లో అప్పటి 41వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిగా, 2004లో వరంగల్ నగర టీడీపీ కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. 2005లో 16వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన నరేందర్, 2008లో వరంగల్ నగర టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం 2009లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఆ తర్వాత 2010లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడైన నన్నపునపేని 2010లో ఆర్‌టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నగర అధ్యక్షుడిగా, 2011లో ఆర్‌టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా, 2012లో ఆర్‌టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఇక 2014లో టీఆర్‌ఎస్ వరంగల్ నగర అధ్యక్షుడిగా, 2015లో టీఆర్‌ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నికైన నరేందర్ ఇప్పటి కొనసాగుతున్నారు. ఈ మేరకు ఆయనకు 23 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది.
 
పేరు     :    నన్నపునేని నరేందర్
వయస్సు     :     43 సంవత్సరాలు
తండ్రి పేరు    :    నన్నపునేని నరసింహమూర్తి
భార్య పేరు    :    నన్నపునేని వాణి
కుమారులు    :    లోకేష్ పటేల్, మన్ ప్రీత్ పటేల్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement