తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేసింది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కేంద్రానికి పంపగా కేంద్రం పలు సవరణలు సూచించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న ఇందుకు సంబం ధించి ఐదు సవరణలను రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆమోదించాయి.
శీర్షికలో మార్పులు, అమలు తేదీ, మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలన్న క్లాజు రద్దు, ప్రభావిత కుటుంబాల్లోని వ్యవసా య కూలీలకు తగిన పరిహారం చెల్లింపు, తదితర సవరణలు ఈ బిల్లులో ఉన్నాయి. దీనికి కేంద్ర న్యాయ శాఖ ఆమోద ముద్ర వేసి హోం శాఖకు పంపింది. దీంతో ఈ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్ర హోంశాఖ సిఫారసు చేస్తూ సోమవారం రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం.