టీ సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత సోనియాకు | Sonia is responsible for the selection of telengan clp leader | Sakshi
Sakshi News home page

టీ సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత సోనియాకు

Jun 1 2014 1:05 AM | Updated on Mar 18 2019 9:02 PM

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ, మండలిపక్ష నేతల ఎంపిక బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీర్మానించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సమావేశంలో తీర్మానం

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ, మండలిపక్ష నేతల ఎంపిక బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీర్మానించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో శనివారం కొత్త ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నాయకులు డి.శ్రీనివాస్, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.కె.అరుణ, మల్లు భట్టివిక్రమార్క సహా పలువురు హాజర య్యారు. అయితే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఏకంగా మూడో వంతు మంది అంటే ఏడుగురు హాజరుకాలేదు.  సమావేశ వివరాలను టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. మూడో తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శాసనసభ సీఎల్పీ సమావేశం... మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మండలి సభ్యుల సమావేశం నిర్వహిస్తామని వారు చెప్పారు.

ఆ సమావేశంలోనే సభాపక్ష నేతల ఎంపిక ఉంటుందన్నారు. దీనికి  దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి పరిశీలకులుగా వస్తారని తెలిపారు. సోనియాగాంధీ నిర్ణయం మేరకే ఆ రోజు నేతల ఎంపిక ఉంటుందన్నారు. కాగా, తెలంగాణ ఆవిర్భావ సంబురాలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, కాగడాల ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. రెండో తేదీన పార్టీ జిల్లా కార్యాలయాల్లో వైద్యశిబిరాలు, రక్తదానాలు నిర్వహించాలన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement