సాగర్ శిక్షణలో సైడ్‌లైట్స్ | Side Lights in Sagar training | Sakshi
Sakshi News home page

సాగర్ శిక్షణలో సైడ్‌లైట్స్

May 4 2015 12:15 AM | Updated on Mar 22 2019 1:49 PM

టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఉదయం 9గంటల నుంచే విజయ విహార్‌లోని శిక్షణ కేంద్రానికి రావడం ప్రారంభమైంది.

 టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఉదయం 9గంటల నుంచే విజయ  విహార్‌లోని శిక్షణ కేంద్రానికి రావడం ప్రారంభమైంది. 10గంటలకు చేతిలో బ్యాగు నోటుబుక్స్‌తో సమావేశమందిరంలోకి చేరారు.
 హాజరుపట్టికలో సంతకం పెట్టి సెలైంట్‌గా కూర్చున్నారు.
 శిక్షణనిచ్చేవారు చెప్పిన ప్రతి అంశాన్ని నోటు చేసుకోవడంతో పాటు అర్ధంకాని అంశాలను అడిగి తెలుసుకున్నారు.
 వాలంటరీలను  మంచినీరు కూడా తాగనివ్వకపోవడంతో వారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆదివారం తాగునీటితో పాటు భోజనాలు ఏర్పాటు చేశారు.
 సమయం పూర్తయ్యేవరకు ఏఒక్క ప్రజాప్రతినిధీ బయటకు రాలేదు.
 శనివారం కన్నా ఆదివారం శిక్షణ సీరియస్‌గా నడిచింది.
 పోలీసులు ఏ ఒక్కరినీ అనుమతిలేకుండా లోపలికి వెళ్లనివ్వలేదు.
 మీడియా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మధ్యాహ్న  భోజనాలు ఏర్పాటు చేశారు.
 దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సాయంత్రం మీడియా వాళ్లు కూర్చోవడానికి విజయవిహార్ ముందు టెంట్ వేసి  కుర్చీలు వేశారు.
 రెండు రోజులకు మేల్కొన్న  టీఆర్‌ఎస్ నాయకులు దూరం నుంచి వచ్చిన మీడియా ప్రతినిధులకు
 అదివారం రాత్రి గెట్‌టూ గెదర్ ఏర్పాటు చేశారు.   
 - నాగార్జునసాగర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement