
మాది కుక్క జాతే, మీది ఏ జాతో...?
కరెంట్ సమస్యపై మంత్రి కేటీఆర్ తో బహిరంగ చర్చకు సిద్దమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు.
హైదరాబాద్: కరెంట్ సమస్యపై మంత్రి కేటీఆర్ తో బహిరంగ చర్చకు సిద్దమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ ఉత్పాదనతో చర్చించేందుకు తాను సిద్దమని ఆయన ప్రకటించారు. ముక్కు ఎవరు నేలకు రాస్తారో చర్చ తర్వాత తేలుతుందన్నారు.
ఆత్మహత్యలు చేసుకోకుండా రైతులకు భరోసా ఇవ్వడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని ఆయన విమర్శించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టు నుంచి 440 మెగావాట్ల విద్యుత్ తేవడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆక్షేపించారు. ప్రజలకు విశ్వాసంగా ఉండడంలో కాంగ్రెస్ నేతలది కుక్క జాతే, మీది ఏ జాతో సీఎం కేసీఆర్ చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.