ముందే సంక్రాంతి | Sankranthi celebrations | Sakshi
Sakshi News home page

ముందే సంక్రాంతి

Jan 11 2015 2:34 AM | Updated on Sep 29 2018 4:44 PM

ముందే  సంక్రాంతి - Sakshi

ముందే సంక్రాంతి

పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తా.. అందరికీ పింఛన్లు అందిస్తానంటూ పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.

తొలిదఫా ఆరు బస్తీల్లో ఇళ్ల నిర్మాణాలు  నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
 
మార్చి తర్వాత మిగిలిన ప్రాంతాల్లో..
నగరంలో 7,914 కుటుంబాలకు లబ్ధి
అర్హులకు ఆసరా పింఛన్ల అందజేత
కలెక్టరేట్ సమీక్ష సమావేశంలో నిర్ణయం
శరవేగంగా అధికారుల ఏర్పాట్లు

 
హన్మకొండ : పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తా.. అందరికీ పింఛన్లు అందిస్తానంటూ పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వరంగల్ నగర పరిధిలో ఆరు మురికివాడల్లో డబుల్ బెడ్  రూం ఫ్లాట్స్ నిర్మాణ కార్యక్రమానికి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఆరు కాలనీలపరిధిలో అర్హులైన 450 మందికి ఆసరా పింఛన్లు అందజేయనున్నారు. హన్మకొండలోనికలెక్టర్ కార్యాలయంలో శని వారం సాయంత్ర ం జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో జీ ప్లస్ వన్ పద్ధతిలో మొత్తం 7,914 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. తొలివిడతలో వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని ఆరు మురికివాడల్లో జీ ప్లస్ వన్ తరహాలో 4,080 నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలనీల్లోని పేదలతోపాటు ఇతర ప్రాంతాల్లో పేదలకు ఇక్కడ ఇళ్లను కేటాయించాలని అధికారులకు సూచిం చారు.

మార్చి తర్వాత వర్ధన్నపేట నియోజక వర్గ పరిధిలోని ఎస్‌ఆర్ నగర్, పరకాల సెగ్మెంట్ పరిధిలో అమీర్‌నగర్ (గరీబ్‌నగర్), వరంగల్ తూర్పు పరిధిలోని గాంధీనగర్, భగత్‌సింగ్ నగర్ కాలనీల్లో జీ ప్లస్ వన్ తరహాలో 3,834 ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. ఈ ఇళ్ల నిర్మాలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయడంతోపాటు దశలవారీగా మురికివాడలను తొలగించి వరంగల్ నగరాన్ని స్లమ్‌లెస్ సిటీగా మార్చనున్నట్లు వివరించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తాను తిరిగిన మురికి వాడల్లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఈ సందర్భంగా అధికారులతో కేసీఆర్ అన్నారు.ఇలాం టి కాలనీలు నగరంలో మరో 60 వరకు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ కాలనీల బాగోగులు పట్టిం చుకోవడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, ఫలితం గా ప్రభుత్వాలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని.. ఈ పరిస్థితిలో ఇకనైనా మార్పు వచ్చేలా అధికారులు కృషిచేయూలని సూచించినట్లు ఉద్యోగుల ద్వారా తెలిసింది.

అన్ని వసతులతో : వరంగల్ తూర్పు పరిధిలో లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్ కాలనీలు.. వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‌లో ప్రగతినగర్, అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, దీన్‌దయాల్‌నగర్ పరిధిలో నిర్మించనున్న కాలనీల్లో సామాజిక అవసరాలైన రోడ్లు, అంగన్‌వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్ల కోసం స్థలం కేటాయిస్తూ లేఅవుట్  రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. డబుల్ బెడ్‌రూం, కిచెన్, హాలు, రెండు మరుగుదొడ్లు ఉండేలా ఇంటి నిర్మాణం ఉండాలన్నారు. డ్రెరుునేజీలు, మంచినీటి పైపులైన్లు కూడా నిర్మించాలన్నారు. ఈ పనులన్నీ 5 నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల్లోనే లబ్ధిదారుల వివరాలను త్వరితగతిన సేకరించిన అధికారులను సీఎం అభినందించారు.  నగ ర పరిధిలో అర్హులైన వారందరికీ  పెన్షన్లు, రేషన్‌కార్డు లు అందజేయూలని, నిర్లక్ష్యానికి తావివ్వొద్దన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం రాజయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ పద్మ, ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యానాయక్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, కలెక్టర్ జి.కిషన్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement