
ఆర్టీసీ ఆస్పత్రిలో సమస్యల రోగం
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంలో 6 జోన్లు ఉండగా కరీంనగర్ జోన్‌లోనే జోనల్ ఆస్పత్రిని నిర్మించారు.
- సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులు
- పట్టని ఉన్నతాధికారులు
ఆర్టీసీ కార్మికులు.. వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటుచేసిన ఆస్పత్రికి సమస్యల రోగం పట్టుకుంది. దవాఖాన ఆధునికీకరణకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. కరీంనగర్‌లో కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఈ ఆస్పత్రి రీజియన్‌లోని ఏడు వేల మంది కార్మికులు సహా చుట్టుపక్కల అరుుదు జిల్లాల కార్మికులకు సేవలందిచాల్సి ఉంది.
- మంకమ్మతోట
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంలో 6 జోన్లు ఉండగా కరీంనగర్ జోన్‌లోనే జోనల్ ఆస్పత్రిని నిర్మించారు. గతంలో నగరంలోని బస్‌స్టేషన్ ఆవరణలో 6 గదుల్లో ఆస్పత్రి నిర్వహించేవారు. కార్మికుల కోరిక మేరకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలనే లక్ష్యంతో అధునాతన సౌకర్యాలతో 10 ఏళ్ల క్రితం ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతoలో దాదాపు ఎకరం స్థలంలో రూ. 10 లక్షలు వెచ్చించి 20 గదులు నిర్మించారు. నిర్మాణం పూర్తికాగానే బస్టాండ్ ఆవరణలోని ఆస్పత్రిని నూతన భవనంలోకి మార్చారు. అన్ని ఉన్నా... అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయూరైంది ఈ ఆస్పత్రి పరిస్థితి. ఇందులో రోగులకు అవసరపడే ఎలాంటి సౌకర్యాలు లేవు. సిబ్బంది నామమాత్రంగానే ఉన్నారు. రోజూ 100 మంది చికిత్సకు వచ్చే ఈ దవాఖానాలో రక్త, మూత్ర పరీక్షలు చేసే వారు ఎవరూ లేరని పలువురు కార్మికులు తెలిపారు. బీపీ, షుగర్, టీబీ తదితలాకు సంబంధించి ఎలాంటి మందులు ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. ఎక్స్‌రే, సిటీ స్కాన్ సదుపాయం కూడా లేదని పేర్కొంటున్నారు. వైద్యులు, సిబ్బందిని పెంచి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్మికులకు సేవలు అందుబాటులో ఉంటేవిధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఐదు జిల్లాల కార్మికులకు సేవలు...
రాష్ట్రం మొత్తంలోనే ఏకైన ఆర్టీసీ జోనల్ ఆస్పత్రి కరీంనగర్ ఉంది. కరీంనగర్ జోన్‌లో ఏడు వేల మంది కార్మికులు సహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్మికుల కుటుంబాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా సేవాలందించాల్సి ఉంది. కాని ఇక్కడ రోగులకు సంపూర్ణంగా వైద్యం అందించే సౌకర్యాలు లేకపోవడంతో ప్రమాదాలు, సీరియస్ కండీషన్ పరిస్థితిలో ఉన్న వారిని నగరంలోని ప్రతిమ, అమృత నర్సింగ్ హోమ్‌లకు రెఫర్ చేస్తున్నారు. ఉన్న ఆస్పత్రిలోనే సౌకర్యాలు కల్పిస్తే రోగులకు ఇబ్బందులు తొలగడమే కాకుండా లక్షలాది రూపాయూలు ఆదా అవుతాయని కార్మికులు పేర్కొంటున్నారు.
ఏడాదికి రూ.10 లక్షలు చెల్లింపు..
సీరియస్ కండీషన్ కేసులకు వెంటనే వైద్యం అందించేందుకు ఇతర ఆస్పత్రులకు తరలించడం వల్ల ఆయూ ఆస్పత్రులకు చెల్లించడం కోసం కార్మికులకు ఏడాదికి దాదాపు రూ. 10 లక్షలు రీఎరుుంబర్స్‌మెంట్ చెల్లిస్తున్నారు. రీరుుంబర్స్‌మెంట్ కింద పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించడంకంటే ఉన్న ఆస్పత్రిని అభివృద్ధి పర్చుకుంటే లక్షలాది రూపాయూలు ఆర్టీసీకి ఆదా అయ్యే పరిస్థితి ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
సౌకర్యాలు లేక ఇబ్బందులు..
ఆస్పత్రిలో పూర్తి సౌకర్యాలు లేక వేరే హాస్పిటల్‌కు రెఫర్ చేస్తున్నారు. ఆస్పత్రి బిల్డింగ్ ఆధునాతన సౌకర్యాలు కల్పిచేందుకు వీలుగా ఉంది. ఇద్దరు డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్ వంటి అన్ని ఏర్పాట్లు చేయూలి. కార్పొరేట్‌స్థారుులో 24 గంటల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తే కార్మికులకు మేలు జరగుతుంది. - మాదాసు వెంకటేశ్,
బహుజన కార్మిక యూనియన్ జిల్లా ఇన్‌చార్జ్జి
నాణ్యమైన సేవలు అందించాలి..
నాణ్యమైన వైద్యం అందించాలి. రోగంతో ఆస్పత్రికి పోతే డాక్టర్ చేయిపట్టి చూడటానికి ఇబ్బంది పడుతుంటారు. డాక్టర్లను మార్చాలి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ప్రతిమ ఆస్పత్రికి పంపిస్తున్నారు. అక్కడ వైద్యం పేరిట ప్రాక్టికల్స్ చేస్తున్నారు. కార్మికులు, వారి కుంటుంబాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యాజమాన్యం పట్టించుకోవడంలేదు.
- గుర్రాల రవీందర్, కండక్టర్, వన్‌డిపో