నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్‌లో ఆదివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు.
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని విద్యానగర్‌లో ఆదివారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. స్థానికంగా ఉండే మూడిళ్లలో చోరీలకు తెగబడ్డారు. కాలనీకి చెందిన గుంటూరు సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలసి హైదరాబాద్ కు వెళ్లారు. ఇంటి తాళం పగలకొట్టి ఇంట్లోకి చొరబడిన దొంగలు సుమారు 4 తులాల విలువైన బంగారు ఆభరణాలను దోచుకు పోయారు. అదే ప్రాంతంలో మరో రెండు ఇళ్లల్లో చోరీకి యత్నించారు. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.