'అందుకే రేవంత్ రెడ్డిని కస్టడీకి కోరుతున్నాం' | revanth reddy custody petiton: prosecution hearings | Sakshi
Sakshi News home page

'అందుకే రేవంత్ రెడ్డిని కస్టడీకి కోరుతున్నాం'

Jun 5 2015 12:38 PM | Updated on Aug 17 2018 12:56 PM

'అందుకే రేవంత్ రెడ్డిని కస్టడీకి కోరుతున్నాం' - Sakshi

'అందుకే రేవంత్ రెడ్డిని కస్టడీకి కోరుతున్నాం'

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో గురువారం వాదనలు ప్రారంభం అయ్యాయి. ఆయనను కస్టడీకి ఇవ్వాలంటూ ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపించింది.

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కస్టడీ పిటిషన్పై ఏసీబీ కోర్టులో గురువారం వాదనలు ప్రారంభం అయ్యాయి. ఆయనను అయిదురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రాసిక్యూషన్ తన వాదనలు వినిపించింది. డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసుకోవాల్సి ఉందని, ఈ వ్యవహారంలో రూ.50 లక్షలు మాత్రమే పట్టుబడ్డాయని, ఈ డబ్బులు ఎవరు సమకూర్చారో  తెలుసుకోవాల్సి ఉందని, కాల్డేటాను విశ్లేషించాల్సి ఉందని, ఎవరెవరితో సంప్రదింపులు జరిపారో అనే దానితో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం చాలా సమావేశాలు జరిగాయని, ఈ కుట్ర వెనుక మొత్తం ఎవరున్నారో తెలుసుకోవాల్సి ఉందని అందుకునే రేవంత్ రెడ్డిని  కస్టడీకి కోరుతున్నట్లు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రధానంగా నాలుగు అంశాల ఆధారంగా ఆయనను కస్టడీకి కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement