అవయవదానం ఘటనలో ఒకరి తర్వాత మరొకరు మృతి చెందగా, నాడు పూడ్చిపెట్టిన మృతదేహాలకు మంగళవారం వైద్యులు పోస్టుమార్టం చేశారు.
రామకృష్ణాపూర్: అవయవదానం ఘటనలో ఒకరి తర్వాత మరొకరు మృతి చెందగా, నాడు పూడ్చిపెట్టిన మృతదేహాలకు మంగళవారం వైద్యులు పోస్టుమార్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్‌లో అక్కకు కాలేయంలో కొంత భాగం ఇచ్చిన చెల్లెలు మృత్యువాత పడగా, శస్త్ర చికిత్స తర్వాత అక్క కూడా మృతి చెందిన సంఘటన తెలిసిందే. రాబర్ట్ డేవిడ్ పెద్ద కూతురు దయారాణికి లివర్ ప్లాంటేషనఖ చేయాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో వారి చిన్నకూతురు నిర్మలారాణి కాలేయంలో కొంత భాగం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. గతేడాది డిసెంబర్‌లో 65 శాతం లివర్ సేకరించి దయారాణికి అమర్చారు. అయితే అదే నెల 29న నిర్మలారాణి మృతిచెందగా.. ఫిబ్రవరి 6న దయారాణి చనిపోయింది.