డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు.
కేసీఆర్ విఫలమయ్యారు: పొన్నం
Jun 28 2017 11:33 AM | Updated on Sep 29 2018 4:44 PM
కరీంనగర్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ విషయంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రూ. 2.66 లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న కేసీఆర్ ఇప్పటివరకు కేవలం 1708 ఇళ్లు మాత్రమే నిర్మించారు.
రూ. 214 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారు. కేంద్ర అర్బన్ హౌసింగ్ కింద విడుదల చేసిన రూ. 975 కోట్లు ఏం చేశారు? ఈ అంశంపై బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదు ఎందుకు? ఇందిరమ్మ ఇళ్లు పశువుల కొట్టాలుగా మారాయని అంటున్న నాయకులను చరిత్ర క్షమించదని అన్నారు.
Advertisement
Advertisement