
రేపు ఆమరణ దీక్ష చేసి తీరుతా: పొన్నం
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా వైద్య కళాశాల కోసం ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
రాజకీయ బిక్ష పెట్టిన కరీంనగర్ను కాదని సిద్ధిపేటకు సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ఇవ్వడం దారుణమన్నారు. కేసీఆర్ను చూసి ఎమ్మెల్యేలు, ఎంపీలు భయపడుతున్నారని ఆయన అన్నారు . జిల్లాకు కాలేజీ ఇచ్చే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తానని పొన్నం అన్నారు. అయితే దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రేపు తలపెట్టనున్నదీక్షలో భాగంగా శుక్రవారం ఆయన వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. స్థానిక నాయకులు ఆయనకు మద్దతు పలికారు.