4న దేవరుప్పులకు హరీశ్‌రావు రాక | On the arrival of 4 devaruppala harish ravu | Sakshi
Sakshi News home page

4న దేవరుప్పులకు హరీశ్‌రావు రాక

May 2 2016 4:25 AM | Updated on Sep 3 2017 11:12 PM

4న దేవరుప్పులకు హరీశ్‌రావు రాక

4న దేవరుప్పులకు హరీశ్‌రావు రాక

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఈనెల 4వ తేదీన మంత్రి హరీశ్‌రావు దేవరుప్పులకు వస్తున్నారని.....

మంత్రి పర్యటనను విజయవంతం చేయూలి
ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు

 
దేవరుప్పుల : పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఈనెల 4వ తేదీన మంత్రి హరీశ్‌రావు దేవరుప్పులకు వస్తున్నారని, ఆయన పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దయాకర్‌రావు పిలుపునిచ్చారు. దేవరుప్పుల నల్లకుంట చెరువులో తలపెట్టిన మిషన్ కాకతీయ చెరువు పనుల ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మండల టీఆర్‌ఎస్ నాయకులతో సమీక్ష జరిపారు. తాగు, సాగు నీరు అందించి పాలకుర్తిని సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలో భాగంగానే మంత్రి హరీశ్‌రావు  పర్యటన ఖరారు అయినట్లు పేర్కొన్నారు.

దేవరుప్పులకు వచ్చే దేవాదుల కాల్వ నీరును చెరువులు నింపేందుకు తూములు, వాగు పరివాహాక ప్రాంతాల్లో భూగర్భ జలాల పెంపు కోసం చెక్‌డ్యామ్‌లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు ఊరూరా పంచాయతీ తీర్మానాల ద్వారా వినతి చేయాలని సూచించారు. పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తానని, త్వరలో సమన్వయ కమిటీల నియమాకం చేపడుతానని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులు ఈదునూరి న ర్సింహరెడ్డి, మొలుగూరి రమేష్, బస్వ మల్లేశం, ఎంపీపీ సోమనర్సమ్మ, వైస్ ఎంపీపీ సోమయ్య, నాయకులు సాయిలు, మేకపోతుల ఆంజనేయులు, సోమనర్సయ్య, బిక్షపతి, జలంధర్‌రెడ్డి, వెంకన్న సర్పంచ్‌లు సునిత, హన్మంతు, భీముడు, భీమ్లా, వజ్రమ్మ, నర్సింహ్మరెడ్డి, సోమయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement