ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

Notification for entrance to NIT and IITs - Sakshi

ప్రవేశాల షెడ్యూలు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉమ్మడి ప్రవేశాలకు షెడ్యూలును విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ ఫలితాలను సీబీఎస్‌ఈ విడుదల చేసింది. అందులో టాప్‌ 2.31 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా ప్రకటించింది. గత నెల 20న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1.64 లక్షల మందే దరఖాస్తు చేసుకున్నారు.

వాటి ఫలితాలను ఈనెల 10న ప్రకటించేందుకు ఐఐటీ కాన్పూర్‌ నిర్ణయించింది. దీంతో ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలకు జోసా బుధవారం కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జారీ చేసింది. 7 దశల్లో ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించేలా చర్యలు చేపట్టింది. కౌన్సెలింగ్‌ను జూలై 19 నాటికి పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. కాగా, విద్యా సంస్థలు, బ్రాంచీల వారీగా అందుబాటులో ఉండే సీట్ల వివరాలు, బిజినెస్‌ రూల్స్‌ను తర్వాత జారీ చేస్తామని జోసా వెల్లడించింది. గతేడాది మొత్తం 37 వేల వరకు సీట్ల భర్తీకి చర్యలు చేపట్టగా ఈసారి కూడా అంత మొత్తం సీట్లు అందుబాటులో ఉండే అవకాశముంది. ఐఐటీల్లో దాదాపు 11 వేలు, ఎన్‌ఐటీల్లో 18 వేలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,343 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఇదీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ షెడ్యూలు
► జూన్‌ 10: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు
► 15న ఉదయం 10 గంటల నుంచి: ప్రవేశాలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, చాయిస్‌ ఫిల్లింగ్‌. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు రాసిన వారు జూన్‌ 18 తర్వాత ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
► జూన్‌ 19న ఉదయం 10 గంటలకు: మాక్‌ సీట్‌ అలొకేషన్‌–1 డిస్‌ప్లే (జూన్‌ 18న ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా).
► 24న ఉదయం 10 గంటలకు: మాక్‌ సీట్‌ అలొకేషన్‌ 2 డిస్‌ప్లే (జూన్‌ 23 వరకు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా).
25న సాయంత్రం 5 గంటలకు: విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చాయిస్‌ ఫిల్లింగ్‌ ముగింపు.
► 26న: డేటా పరిశీలన, సీట్‌ అలొకేషన్‌ పరిశీలన.
► 27న ఉదయం 10 గంటలకు: మొదటి దశ సీట్ల కేటాయింపు.
► జూన్‌ 28 నుంచి జూలై 2 సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్‌.
► జూలై 3న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాల ప్రకటన, సాయం త్రం 5 గంటలకు: రెండో దశ సీట్ల కేటాయింపు.
► 4, 5 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్‌. రిపోర్టింగ్‌ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ.
► 6న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్లు కేటాయింపు.
► 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్‌. రిపోర్టింగ్‌ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ.
► 9న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాల ప్రకటన. సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు.
► 10, 11 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్‌. రిపోర్టింగ్‌ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ.
► 12న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు.
► 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్‌. రిపోర్టింగ్‌ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ.
► 15న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. సాయంత్రం 5 గంటలకు ఆరో దశ సీట్ల కేటాయింపు.
► 16, 17 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్‌. రిపోర్టింగ్‌ కేంద్రాల్లో సీట్ల ఉపసంహరణ. సీట్ల ఉపసంహరణకు ఇదే చివరి అవకాశం.
► 18న ఉదయం 10 గంటలకు: భర్తీ అయిన సీట్ల డిస్‌ప్లే, ఖాళీల వివరాలు ప్రకటన. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ సీట్ల కేటాయింపు.
► 19న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు: డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్‌ యాక్సెప్టెన్సీ, రిపోర్టింగ్‌. కాలేజీల్లో చేరడం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top