స్వార్థ రాజకీయాలు కాదు | not a selfish politics | Sakshi
Sakshi News home page

స్వార్థ రాజకీయాలు కాదు

Apr 16 2014 6:40 AM | Updated on Sep 17 2018 5:10 PM

‘‘రాజకీయ నాయకులు ప్రచారాలకు వెళ్తే ప్రజలు ఆసక్తిగా తరలివచ్చే వారు. ప్రసంగాలను వినేవారు. తర్వాత వచ్చిన వారికి మర్యాద పూర్వకంగా భోజనాలు వండి పెట్టేవారు.

 ‘‘రాజకీయ నాయకులు ప్రచారాలకు వె ళ్తే ప్రజలు ఆసక్తిగా తరలివచ్చే వారు. ప్రసంగాలను వినేవారు. తర్వాత వచ్చిన వారికి మర్యాద పూర్వకంగా భోజనాలు వండి పెట్టేవారు. ప్రచారానికి వచ్చి న అన్ని పార్టీల వారూ అందరం కలిసే భోజనం చేసే వాళ్లం. నిస్వార్థానికి మారుపేరు నాటి రాజకీయాలు.’’
 
 నోటా మంచిదే..
 రాజకీయ నాయకులను ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మద్దో ప్రస్తుత రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామం. నమ్మి ఓట్లు వేయించుకున్నాక ప్రజలను నాయకులు చూడడం లేదు. అందుకు.. ఓటు ఎవరికీ వేయలేము అనే భావనాకు వస్తున్నారు. అందుకోసమే ఎన్నికల సంఘం ఈసారి నోటి ఆప్షన్ పెట్టింది. అది మంచిదే. నాడు పార్లమెంట్, శాసనసభల్లో ఏదైనా బిల్లు ప్రవేశ పెడితే ఒక్కొక్కరుగా మాట్లాడుతూ సవరణలు చేసేవాళ్లు. కానీ ఒకరిపై ఒకరు అరుస్తూ.. స్వీకర్‌ను అగౌరపరుస్తూ వాకౌట్ చేసే వారుకాదు. కలిసి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధిని కోరుకునే వారు. ప్రస్తుతం పార్లమెంట్ సభలతో సమయంతోపాటు డబ్బును వృథా చేస్తున్నారు. ప్రజల్లో నిరుత్సాహం నింపుతున్నారు. అందుకే.. ప్రజలారా మంచి నాయకున్ని చూసి ఎన్నుకోండి.

 పాయల్ శంకర్‌పై కేసు
 ఆదిలాబాద్ రూరల్/కడెం, న్యూస్‌లైన్ : ఈ నెల 13న జెడ్పీ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై పీవోలకు, ఏపీవోలకు శిక్షణ కొనసాగుతున్న సమయంలో బీజేపీ ఎమ్మేల్యే అభ్యర్థి పాయల్ శంకర్ పార్టీ పోస్టల్ బ్యాలెట్ చూపిస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కోడ్ ఉల్లఘించడంతో ఆయనపై కేసు నమోదు చేసిన్నట్లు టూటౌన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహించి నందుకు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకుడు లచ్చన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీశ్ తెలిపారు.

 గాంధీజీ సిద్ధాంతాలు..మార్గదర్శకాలు..
 1964లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలిచాను. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేసి గెలుపొందా. అప్పుడు మాకు ప్రతిపక్షంగా కమ్యూనిస్టూ పార్టీ ఉండేది. పార్టీలు వేరైనా కలిసే పనిచేసేవాళ్లం. ఎన్నికల్లో ప్రచారాలూ కలిసే చేసేవాళ్లం.. ఎవరు గెలిచినా కలిసి పనులు చేసుకునేవాళ్లం. నాటి రాజకీయాలు నిస్వార్థంగా ఉంటే అభివృద్ధిని కాక్షించేవి. కానీ.. ఇప్పుడు రాజకీయాలు విషపూరితంగా మారాయి. వ్యాపారంగా మారాయి. నియోజకవర్గంలోని చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాలంటే అక్కడక్కడా సైకిళ్లు, ఎడ్లబండ్లు ఉండేవి. వాటిపైనే ఊళ్లలోకి వెళ్తూ ప్రచారాలు చేసేవాళ్లం.

 కమ్యూనిస్టు పార్టీ వాళ్లు, కాంగ్రెస్ పార్టీ వాళ్లం ఒక్కో ఊరికి వెళ్లి ఒకరి తర్వాత ఒకరు ప్రసంగాలు చేసేవాళ్లం. అరగంట ప్రజలతో మేము మాట్లాడితే.. అరగంట వాళ్లు మాట్లాడేవాళ్లు. కానీ.. గోడవలు, ఈర్ష్యద్వేషాలు నాడు లేవు. ఏదైనా విభేదాలు వస్తే అక్కడే బహిరంగంగా క్షమాపణ చెప్పి తిరిగి కలిసిపోయే వాళ్లం. ఇప్పుడు ఒక పార్టీ అంటే మరో పార్టీకి పడదు. ఆ కాలంలో డబ్బు.. కులం.. చిన్న.. పెద్ద భావనలు లేవు. అందరినీ సమానత్వ భావనతో చూసేవాళ్లు. నాయకత్వం కలిగిన వాడే నాయకుడు.. డబ్బున్న వాడు కాదు. ప్రస్తుతం వ్యాపారసంస్థలు, సముదాయాలు ఉన్నవారే రాజకీయాల్లోకి వస్తున్నారు.

 సామాన్య వక్తులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వార్డు మెంబర్ నుంచి ఎంపీ ఎమ్మెల్యే వరకు సేవదృక్ఫథం కలిగిన వారే ఉండేవారు. నేడు సంపదకు మార్గాలుగా రాజకీయాలు తయారయ్యాయి. నేను 13 ఏళ్ల వయసులో (1952) రాజకీయాలకు వచ్చాను. అప్పటి నుంచే పనులు చేసేవాన్ని. గాంధీజీ సిద్ధాంతాలు, శాంతిమార్గం నాకు మార్గదర్శకాలు. ఇప్పటికీ వాటిని సగౌరవంగా పాటిస్తాను. ఆదిలాబాద్ నియోజకవర్గానికి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement