నిట్‌లో ‘చెప్పుల దండ’ కలకలం | Nit in the "shoe garland 'uproar | Sakshi
Sakshi News home page

నిట్‌లో ‘చెప్పుల దండ’ కలకలం

Apr 21 2016 1:21 AM | Updated on Sep 3 2017 10:21 PM

కాజీపేట నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఇన్‌చార్జి నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.సైదులుకు కేటారుుంచిన ...

ఇన్‌చార్జి డెరైక్టర్ లక్ష్యంగా దుశ్చర్య
నిట్ ఇన్‌చార్జి డైరక్టర్ పదవికి సైదులు రాజీనామా

 

కాజీపేట రూరల్ : కాజీపేట నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఇన్‌చార్జి నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.సైదులుకు కేటారుుంచిన 506 నంబర్ గదికి గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం చెప్పుల దండ వేయడం కలకలం సృష్టించింది. నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు ఏపీ నిట్ డైరక్టర్‌గా విధులు నిర్వహిస్తుండటంతో వరంగల్ నిట్ ఇన్‌చార్జి డైరక్టర్‌గా ఫ్యాకల్టీ వెల్ఫేర్ డీన్ ఎం.సైదులుకు బాధ్యతలను అప్పగించారు. ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఏపీ నిట్‌కు వెళ్లిన రోజుల్లో ప్రొఫెసర్ సైదులు ఇన్‌చార్జిగా డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ విభాగంలో ఆయనకు కేటాయించిన గదికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేసిన ఘటన నిట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో మనస్తాపం చెందిన ప్రొఫెసర్ సైదులు తన ఇన్‌చార్జీ డైరక్టర్ పదవికి రాజీనామా చేశారు. నిట్ అధ్యాపకుల్లో కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఆనందిస్తున్నారని, ఫలితంగా నిట్ ప్రతిష్ట దెబ్బతింటుందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. నిట్‌లో జరిగిన ఘటనపై నిట్ డైరక్టర్ టి.శ్రీనివాస్‌రావును వివరణ కోరేందుకు సెల్‌ఫోన్లో ప్రయత్నించగా స్పందించలేదు.

 
ఉద్దేశపూర్వకంగానే చేశారు : ప్రొఫెసర్ సైదులు     

నిట్‌లో నాకు కేటాయించిన గదికి ఎవరో ఉద్దేశపూర్వకంగానే చెప్పుల దండ వేశారు. నిట్ డైరక్టర్ శ్రీనివాసరావు ఏపీ ఎన్‌ఐటీకికి విధులపై వెళ్తున్నప్పుడు నన్ను ఇక్కడ ఇన్‌చార్జి డైరక్టర్‌గా నియమించారు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నా గదికి చెప్పుల దండ వేసిన విషయం ఒకరు వచ్చి చెప్పారు. నిట్‌లో నా గదికి చెప్పుల దండ వేయడంపై మనస్తాపం ఇన్‌చార్జి డైరక్టర్ పదవికి రాజీనామా చేశా.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement