‘పచ్చని’ ప్రణాళిక

NABARD Released Telangana Annual Loan Planning - Sakshi

2020–21 ఫోకస్‌  పేపర్‌ విడుదల చేసిన నాబార్డు 

వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 73,686 కోట్లు

వీటిలో పంట రుణాలకే రూ. 51 వేల కోట్లు కేటాయింపు

గృహ రుణాలకు రూ. 8,149 కోట్లు

విద్యా రుణాలకు  రూ. 2,256 కోట్లు

మొత్తం రుణాల్లో  44శాతం పంట రుణాలకే

వచ్చే ఏడాది హైటెక్‌ అగ్రికల్చర్‌ థీమ్‌తో ముందుకు..

రాష్ట్ర రుణ ప్రణాళిక   1,14,578 కోట్లు  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రుణ ప్రణాళికను నాబార్డు ప్రకటించింది. 2020–21 సంవత్స రానికి రూ.1,14,578 కోట్లతో రుణ ప్రణాళిక ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు బ్యాం కులకు దిశానిర్దేశం చేస్తూ గురువారం రాష్ట్ర రుణ ప్రణాళిక ఫోకస్‌ పేపర్‌ను విడుదల చేసింది. ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు విడుదల చేసిన ఈ రుణ ప్రణాళిక ఫోకస్‌ పేపర్‌లో మొత్తం రుణాల్లో 64% వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించాలని సూచిం చింది. కీలకమైన పంట రుణాలకు 44% కేటాయించారు. 2019–20 ఫోకస్‌ పేపర్‌లో రుణ ప్రణాళిక పరిమితి రూ.1,01,378 కోట్లు కాగా, ఈసారి అదనంగా రూ.13,199.59 కోట్ల అంచనాలు చూపడం గమనార్హం. వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నం దున ఆ మేరకు కేటాయింపులు భారీగా పెంచాలన్నది నాబార్డు ఉద్దేశంగా కనిపి స్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సం బంధించి వివిధ రంగాలకు రుణ కేటాయిం పులు ఎలా ఉండా లన్న దానిపై నాబార్డు అన్ని జిల్లాల నుంచి వివిధ శాఖల ద్వారా క్షేత్ర స్థాయి వివరాలను సేకరించింది. వాటిని క్రోడీ కరించి ఈ రుణ ప్రణాళిక ఫోకస్‌ పేపర్‌ను విడుదల చేసింది. దీని ఆధారంగా రాష్ట్ర రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) త్వరలో విడుదల చేయనుంది.

వ్యవసాయం.. అనుబంధ రంగాలు
మొత్తం రుణ ప్రణాళికలో రూ.73,686.16 కోట్లు వ్యవ సాయం, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ సహా దాని అనుబంధ రంగాలన్నింటికీ రుణా లివ్వాల్సిన ప్రాధాన్యాన్ని తెలిపింది. అందు లో రూ.51,082.72 కోట్లు పంట రుణాలకు మార్కెటింగ్‌కే కేటాయిం చాలని తెలిపింది. గతేడాది ఫోకస్‌ పేపర్‌లో పంట రుణాలకు రూ.49,785.59 కోట్లు ప్రక టించారు. ఈసారి అదనంగా రూ.1,297.13 కోట్లు ఉండటం గమనార్హం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కీలకమైన డెయిరీకి రూ.1,848 కోట్లు, పౌల్ట్రీకి రూ.1,074 కోట్లు, గొర్రెలు, మేకల రంగానికి రూ.1,083 కోట్లుగా ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ.2,843 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఫుడ్, అగ్రో ప్రాసెసింగ్‌కు రూ.1,232.66 కోట్లు చూపారు. వ్యవసాయ మార్కెటింగ్‌లో మౌలిక సదుపాయాలు, గోదాములకు రూ.1,481 కోట్లు కేటాయించాలని సూచించింది. గృహ రుణాలకు రూ.8,149 కోట్లు, విద్యా రుణాలకు రూ.2,256 కోట్లు ఇవ్వాలని పేర్కొంది.

ఉత్పత్తి పెంచేలా హైటెక్‌ అగ్రికల్చర్‌..
ఈసారి హైటెక్‌ అగ్రికల్చర్‌పై దృష్టి సారించనున్నట్లు నాబార్డు పేర్కొంది. వచ్చే ఏడాది హైటెక్‌ అగ్రికల్చర్‌ థీమ్‌తో ముందుకు సాగనున్నట్లు తెలిపింది. ఇది పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు దోహదపడుతుందని వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రంలో అనుకూలమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యాన పంటల ఉత్పత్తికి హైటెక్‌ వ్యవసాయ పద్ధతులు ఉపయోగపడుతున్నట్లు వివరించింది. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఉత్పాదకత మెరుగుపర్చుకునే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపింది. మట్టి రహిత (సాయిల్‌ లెస్‌) వ్యవసాయం, గ్రీన్‌హౌస్‌ రక్షిత సాగు, హైడ్రోపోనిక్స్‌ సాగు, ఏరోపోనిక్స్, వర్టికల్‌ సాగు హైటెక్‌ అగ్రికల్చర్‌లో భాగంగా ప్రోత్సహించనుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top