కాంగ్రెస్‌– బీజేపీలను ఓడిద్దాం

MP kavitha Said Do Not Vote For Congress And BJP - Sakshi

ఫెడరల్‌ ఫ్రంట్‌తోనే మైనారిటీలకు న్యాయం

కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగానే చూసింది. 

టీఆర్‌ఎస్‌తోనే మైనారిటీలకు లబ్ధి  

టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవిత  

బోధన్‌ టౌన్‌ : దేశంలోని మైనారిటీకు ఫెడరల్‌ ఫ్రంట్‌తోనే న్యాయం జరుగుతుందని, 70ఏళ్ల పాలనలో కాంగ్రెస్, బీజేపీలు మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించాయని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పార్లమెంట్‌ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నిజామాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం రాత్రి బోధన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మైనారిటీల  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేనానికి కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అలాగే బోధన్‌లో జరిగిన కమ్మ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కవిత ప్రసంగించారు.

కాంగ్రెస్‌ పార్టీ పాలనలో  మైనార్టీలకు ఓటు బ్యాంకుగా మార్చు కున్నారని, మైనార్టీల అభివృద్ధిని విస్మరించారని గుర్తు చేశారు. దేశంలో 36 కోట్ల మంది మైనార్టీలు ఉన్నారని, వారి సంక్షేమం కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ పనిచేస్తుందన్నారు. దేశంలో 40 శాతం ప్రజలు ప్రాంతీయ పార్టీలకు అండగా ఉన్నారని, వీరందరు, ఒక్కటైదే ఫ్రడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుందన్నారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని  కేసీఆర్‌ హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీలో తీర్మాణం చేసి పంపామని గుర్తు చేశారు.   దేశంలో మోదీ ప్రభుత్వం  గ్రాఫ్‌ పడిపోయిందని ఆరోపించారు.

బీజేపీ పార్టీ అధికారంలోకి రాక ముందు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి ప్రజలకు పంచుతానని హామీ ఇచ్చారని, 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌లు కల్పిస్తామని చెప్పి విస్మరించారని విమర్శించారు. బీజేపీ కాదని, భారతీయ జూట పార్టీ అని ఆరోపించారు.

 రాహుల్‌కు  విజన్‌ లేదు...  
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రాçహుల్‌ గాంధీకి ఒక విజన్‌ లేదని,   కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేసేది చెప్పడంలో విఫలం అవుతున్నారని, కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడం నమ్మడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎంపీలకు మైనార్టీల ఓటు పడకుండా  చూడాలన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పోరులో కాంగ్రెస్‌ పార్టీ కనబడడం లేదని, మధుయాష్కి పారీ పోయాడని, దేశంలో కాంగ్రెస్‌ పార్టీ తీరు నిజామాబాద్‌ తరహాలోనే ఉందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కేసీఆర్‌    కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు.  బోధన్‌– బీదర్‌ రైల్వే ప్రాజెక్టు కోసం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి కృషి చేస్తానని, ఇచ్చిన మాట ప్రకారం పెద్దపల్లి– నిజామాబాద్‌ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేశామని గుర్తు చేశారు.   క్రిస్టియన్, మైనారిటీలు అధైర్య పడవద్దన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top