
70 నియోజకవర్గాల్లో సంచార పశు వైద్యశాలలు
తెలంగాణలోని డెబ్భై నియోజకవర్గాల్లో జనవరి ఒకటి నుంచి సంచార పశువైద్యశాలలను ప్రారంభించనున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థ్ధక శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
* 4,442 ఏఈవో పోస్టులు భర్తీ
* 72 ఏడీఏ భవనాల నిర్మాణం
* రూ. 200 కోట్లతో పరికరాలు పంపిణీ
* రూ. 250 కోట్లతో పాలీహౌస్‌ల నిర్మాణం
* వ్యవసాయ శాఖ మంత్రి పోచారం
సిరిసిల్ల: తెలంగాణలోని డెబ్భై నియోజకవర్గాల్లో జనవరి ఒకటి నుంచి సంచార పశువైద్యశాలలను ప్రారంభించనున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థ్ధక శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రూ.6.10 కోట్లతో వ్యవసాయ పాలి టెక్నిక్ కాలేజీకి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశు వైద్యశాలలు లేని ప్రాంతాల్లో 108లాగే పని చేసే సంచార పశువైద్యశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదర్శ రైతుల పోస్టుల్ని రద్దు చేశామని, త్వరలో 4,442 ఏఈవో పోస్టుల్ని భర్తీ చేస్తామని వెల్లడించారు. మండ ల వ్యవసాయ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని 72 ప్రాంతాల్లో రూ.35 లక్షల చొప్పున వెచ్చించి ఏడీఏ భవనాలను నిర్మిస్తామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.200 కోట్లతో రైతులకు ఆధునిక పరికరాలను అందిస్తున్నామన్నారు. రూ.250 కోట్లతో పాలీహౌస్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తామని, కూరగాయలు, పూల పెంపకానికి చేయూతనిస్తామన్నారు. గొర్రె ల పెంపకందారులకు 20శాతం సబ్సిడీతో రూ.5 లక్షల వరకు రుణవసతి కల్పిస్తామనన్నారు. రాష్ట్రంలో 8 వ్యవసా య పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరయ్యాయన్నారు.
త్వరలో రైతులందరికీ భూసార కార్డులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హెల్త్ కార్డుల తరహాలో ప్రతి రైతుకూ భూసార పరీక్షా కార్డులను త్వరలో అందజేస్తామని మంత్రి పోచారం చెప్పారు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం వ్యవసా య, అనుబంధ రంగాలపై నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి పోచారంతోపాటు ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమ యి బాలకిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ స్త్రీనిధి కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రెండు గేదెలు కొనుగోలు చేసేందుకు వడ్డీ లేకుండా రూ.80 వేల రుణం ఇప్పిస్తామన్నారు. బర్రెల దాణాకు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు.