సాక్షి, హైదరాబాద్: నగరవాసుల భాగస్వామ్యంతోనే సిటీ సమగ్రాభివృద్ధి చెందుతుందని ఐటీశాఖ మంత్రి కేటీ. రామారావు అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 16న మన నగరం అనే పేరుతో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ‘మనం మారుదాం.. మన నగరాన్ని స్వచ్ఛంగా మారుద్దాం’ అనే నినాదంతో మంత్రి కేటీఆర్ నగరవాసులకు పిలుపునిచ్చారు.
నగరంలో దోమల నివారణకు మస్కిటో యాప్ ద్వారా చైత్యన్యం తీసుకోస్తామని ఆయన సూచించారు. అంతేకాక గొర్రెల కాపరులను ఆర్థికంగా పటిష్టం చేసేందుకు గొర్రెల పంపణీ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు.