మెట్రో రైలుపైన సమీక్ష నిర్వహించిన కేటీఆర్‌

Metro train review conducted by ktr - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం  మెట్రో రైలు పైన సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్) అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ల సంఖ్యను పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీంచాలన్నారు. అయితే వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రయాణీకుల సంఖ్యను బట్టి ఫ్రీక్వెన్సీని పెంచుదామని మంత్రికి... హెచ్ఎంఆర్‌ అధికారులు తెలిపారు. మెట్రో ప్రయాణీకులకు అవసరం అయిన పార్కింగ్ సౌకర్యాలపైన కేటీఆర్‌ ప్రత్యేకంగా చర్చించారు.

అవసరం మేరకు పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు ఉన్న పార్కింగ్ ప్రాంతాలను ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. మెట్రో కోసం అవసరమైన మేరకు పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని హెచ్ఎంఆర్‌ అధికారులను కేటీఆర్‌ సూచించారు. ప్రజలకు మెట్రో స్మార్ట్ కార్డుల వినియోగం, ప్రయోజనాలు ప్రజలకు మరింత తెలిసేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. మెట్రో ఫీడర్ల మార్గంలో మరిన్ని బస్సులను ఏర్పాటు చేసేలా అర్టీసీతో చర్చించాలన్నారు. ప్రయాణీలకుల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ పైన మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. మెట్రో స్టేషన్లలో తాగునీరు, మూత్రశాలల ఏర్పాటుపైన త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం పరిమితంగా ఉన్న మూత్రశాలలకు అదనంగా మరిన్ని టాయ్‌లెట్‌ల నిర్మాణం తక్షణం చేపట్టాలన్నారు. దీంతోపాటు జూన్ 1 డెడ్ లైన్ పెట్టుకుని ఐటీ కారిడార్లో మెట్రో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపయోగపడే అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గం పైన ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. మెట్రో కారిడార్లలో చేపట్టిన పుట్ పాత్ల అభివృద్ది పనులను మంత్రి సమీక్షించారు. హైదరాబాద్ నగర ప్రజలు మెట్రో రైలును ఆహ్వనించిన తీరు, వారు మెట్రో రైలు వినియోగంలో ప్రదర్శిస్తున్న క్రమశిక్షణ పట్ల మంత్రి కృతజ్ఞలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top