
క్యూ1 ఆర్థిక ఫలితాలపై సమీక్ష
ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు అధ్యక్షతన ఆర్థిక శాఖ మూడు గంటలపాటు సమావేశం నిర్వహించింది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై సమీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఉత్పాదక రంగాలకు రుణాల విడుదలను పెంచవలసిందిగా బ్యాంకుల ఎండీలు, సీఈవోలను నాగరాజు కోరినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్‌టీ శ్లాబ్‌లో చేర్చాలి
బ్యాంకింగ్ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ. 44,218 కోట్ల నికర లాభం ఆర్జించాయి. వార్షికంగా ఇది 11 శాతం వృద్ధికాగా.. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 39,974 కోట్ల లాభం ఆర్జించాయి. ఈ ఏడాది క్యూ1లో ప్రభుత్వ బ్యాంకులు ఆర్జించిన రూ. 44,218 కోట్ల లాభాల్లో కేవలం ఎస్‌బీఐ 43 శాతం వాటా ఆక్రమించడం విశేషం!