ప్రేమ వ్యవహారం వికటించి అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఖమ్మం క్రైం : ప్రేమ వ్యవహారం వికటించి అనుమానాస్పదస్థితిలో ఓయువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మధిరకు చె ందిన తాండ్రకృష్ణ(23) ఖమ్మంలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ మామిళ్లగూడెంలో ఓగది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతను కొంతకాలంగా మధిరకు చెందిన యువతి ప్రేమలో పడ్డాడు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం 10 గంటలు అయినా తాండ్రకృష్ణ తలుపులు తీయ్యక పోవటంతో చుట్టు పక్కలవారు అనుమానంతో తలుపులు పగులకొట్టి చూశారు. వారికి గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకున్న కృష్ణ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుని తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. కాగా శనివారం రాత్రి కృష్ణ గదికి అతను ప్రేమించిన యువతి రావడం చూశామని స్థానికులు పేర్కొన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.