పాస్‌పుస్తకం లేకుండానే రుణం!

A loan without a passbook! - Sakshi

వెబ్‌ల్యాండ్‌లోని 1బీ రికార్డు ఆధారంగానే రైతులకు పంట రుణాలు

మ్యుటేషన్‌ మార్పు సమాచారం 30 రోజుల్లో తహసీల్దారుకు

పాస్‌బుక్కులో తప్పులు సరిచేసే అధికారం ఇక తహసీల్దార్లకు

శాసనసభలో పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–1971కి సవరణ బిల్లు

సాక్షి, హైదరాబాద్‌: రైతులు పంట రుణాల కోసం ఇక నుంచి తమ పాస్‌పుస్తకాలను బ్యాం కుల్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. వెబ్‌ల్యాండ్‌ డాటాలోని 1బీ రికార్డు ఆధారం గానే క్రెడిట్‌ ఏజెన్సీ (బ్యాంకులు) రుణాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–1971కి సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ సోమవారం శాసనసభలో బిల్లు ప్రవేశపె ట్టారు. ఆ బిల్లులోని ముఖ్యాంశాలివి..

♦  భూమి హక్కుల్లో ఎలాంటి మార్పు జరిగినా మ్యుటేషన్‌ వివరాలను ఆ హక్కు పొందిన 30 రోజుల్లోగా తహసీల్దారుకు సమాచారం ఇవ్వాలి. ఈ సమాచారాన్ని పొందిన వీఆర్వో ఒక్క రోజులోనే ఆ విషయాన్ని తహసీల్దారుకు తెలియపర్చాల్సి ఉంటుంది. ఈ సమాచారానికి తహసీల్దారు రసీదు ఇవ్వాలి.
♦   పాస్‌పుస్తకాల్లో మార్పు కోసం ఎవరైనా అభ్యర్థన చేసుకుంటే వాటిని సరిచేసే అధికారం తహసీల్దార్లకే ఉంటుంది.
♦  డిసెంబర్‌ 31, 2017 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సాదాబైనామాలు లేకపోయినా స్థానికంగా విచారణ జరిపి గ్రామసభ ఆమోదం తీసుకుని సదరు క్లెయిమ్‌ను క్రమబద్ధీకరించవచ్చు. అయితే, ఆ భూమి ఐదెకరాలకు మించరాదు.
♦  పట్టాదారు పాస్‌పుస్తకం ప్రభుత్వ వెబ్‌ సైట్‌లో నిర్వహించే పట్టాదారు పాస్‌ పుస్తకంగా మారుతుంది. అందులో తాకట్టు దారు (మార్టిగేజ్‌), కౌలుదారు (టెనెంట్‌) అనే పదాలుండవు. కేవలం పట్టాదారులు అనే పదం మాత్రమే ఉంటుంది.
♦  పట్టాదారు పాస్‌పుస్తకం కోసం అడగకుండా వెబ్‌ల్యాండ్‌ డాటా ప్రకారం నిర్వహించే 1–బీ రెవెన్యూ రికార్డు ఆధారంగానే క్రెడిట్‌ ఏజెన్సీ రుణాన్ని మంజూరు చేయాలి.
♦  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములకు రక్షణ కల్పించేందుకు గాను హైదరాబాద్‌ జాగీర్దార్ల రద్దు చట్టం, 1358 ఫసలీ ప్రకారం ఉన్న జాగీరు భూములన్నీ ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదు చేస్తారు.
♦  ఈ బిల్లు ఆమోదంలోకి వస్తే తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పాస్‌ పుస్తకాల సవరణ ఆర్డినెన్స్‌ రద్దవుతుంది. ఈ బిల్లు జూన్‌17, 2017 నుంచి అమల్లోకి వచ్చినట్టు అవుతుంది.
♦  ఈ బిల్లుతో పాస్‌బుక్, టైటిల్‌డీడ్‌ ఏకీకృతంగా మారుతాయి. మ్యుటేషన్‌ కాలపరిమితి 90 రోజుల నుంచి 15 రోజులకు తగ్గిపోతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top