మన ‘గ్రహ’బలం ఎంత?

Living Atmosphere On Different Planets - Sakshi

మీరీ విషయం విన్నారా.. మన భూమిలాగే ఉన్న మరో గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారట. అక్కడ జీవులు నివసించేందుకు అనుకూలమైన వాతావరణం కూడా ఉందంటున్నారు..

అవునూ.. ఇక్కడ భూమ్మీద కాబట్టి మనం హాయిగా జీవించగలుగుతున్నాం. అదే సౌర కుటుంబంలోని మిగతా గ్రహాలకుగానీ మనం వెళితే.. స్పేస్‌ సూట్‌ లేకుండా అక్కడ మనం బతకగలమా? బతికితే ఎన్నాళ్లూ లేదా ఎన్ని క్షణాలు? ఈ డౌట్‌ మీకెప్పుడైనా వచ్చిందా? మాకు వచ్చింది.. మరి సమాధానం కనుగొందామా? చలో మరి సౌర కుటుంబంలోని మన బంధువుల ఇంటికి..

సూర్యుడు.. 
సూర్యుడి దగ్గరికి వెళ్లగానే వెంటనే మాడిపోయి.. ఆవిరైపోతాం. కాబట్టి ఇక్కడ అస్సలు చాన్సే లేదు.   
బతికే సమయం: సెకను కన్నా తక్కువ 

బుధుడు
సూర్యుడి వైపు ఉన్న ప్రాంతం చాలా వేడిగా ఉంటుంది. అక్కడ 427 డిగ్రీల సెల్సియస్‌  ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి వైపు కాకుండా ఉన్న ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మైనస్‌ 179 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ రెండు ప్రాంతాలు కలిసే చోట నిలబడితే మనం ఊపిరి బిగబట్టే సమయం బతకొచ్చు. 
బతికే సమయం: రెండు నిమిషాలకు పైగా.. 

శుక్రుడు
దీనిపై దాదాపు 482 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి భూమిపై మాదిరిగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఆవిరి అయ్యేంత సమయం బతుకుతాం.  
సమయం: సెకను కన్నా తక్కువ 

భూమి
ఆక్సిజన్, నీరు, ఆహారం ఇవన్నీ మానవ జీవనానికి అనుకూలంగాదీన్ని మార్చేశాయి.  
సమయం: 80 సంవత్సరాలకు పైగా.. 

అంగారకుడు
ఈ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. గాలి చాలా పలుచగా ఉండటంతో ఈ చల్లదనం మన భూమిపై మాదిరిగా బాధించదు. 
సమయం: రెండు నిమిషాలకు పైగా.. 

గురుడు
పూర్తిగా వాయు గ్రహం కాబట్టి.. ఇక్కడ బతకడం చాలా కష్టం. నిలబడాలని ప్రయత్నిస్తే ఆ గాలి లోపలికి వెళ్లిపోతాం. అక్కడి పీడనానికి వెంటనే ఆ గాలిలోనే కలసి పోతాం. 
సమయం: సెకను కన్నా తక్కువ.. 

శని
శనిగ్రహం చుట్టూ ఉన్న వలయాల కారణంగా ఈ గ్రహంపై నడవలేం.. కనీసం నిల్చోలేం. 
సమయం: సెకను కన్నా తక్కువ. 

యురేనస్‌, నెప్ట్యూన్‌
గురుడు మాదిరిగానే ఈ రెండు గ్రహాలు కూడా వాయు గ్రహాలే. ఇక్కడ కూడా ఆ వాయువుల్లోకి వెళ్లిపోతాం. వాయువుల పీడనానికి గాల్లోనే కలసిపోతాం. 
బతికే సమయం: రెండు గ్రహాల్లో సెకను కన్నా తక్కువ.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top