తల్లాడ అడవిలో చిరుత సంచారం  | Leopard Caught At Thallada Forest In Khammam | Sakshi
Sakshi News home page

తల్లాడ అడవిలో చిరుత సంచారం 

May 22 2019 2:03 AM | Updated on May 22 2019 2:03 AM

Leopard Caught At Thallada Forest In Khammam - Sakshi

తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ అటవీ క్షేత్ర పరిధిలో చిరుత సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. జాతీయ జంతు గణనలో భాగంగా 2018 జనవరి 24న చిరుత పాదముద్రలను కనుగొన్నారు. ఆ తర్వాత తల్లాడ రేంజ్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మూడు నెలల క్రితం సీసీ కెమెరాలను అడవిలో ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఈనెల 18న చిరుత సంచరించినట్లు సీసీ కెమెరాల్లో ట్రాక్‌ అయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రదేశాన్ని సత్తుపల్లి ఎఫ్‌డీఓ సతీష్‌కుమార్, తల్లాడ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి అరవింద్‌కుమార్‌ తదితరులు మంగళవారం సందర్శించారు. అక్కడ చిరుత పులి సంచారం, కాలి ముద్రలను గుర్తించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement