భీమ్ వర్ధంతి ఏర్పాట్ల సమీక్షలో సీఎం | Komuram Bhim death anniversary celebrations | Sakshi
Sakshi News home page

భీమ్ వర్ధంతి ఏర్పాట్ల సమీక్షలో సీఎం

Sep 30 2014 12:30 AM | Updated on Aug 15 2018 9:22 PM

ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీమ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించి.. ఘన నివాళి అర్పిద్దామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు.

ఘన నివాళి అర్పిద్దాం..
200 ఎకరాల్లో భీమ్ మెమోరియల్

సాక్షి, మంచిర్యాల : ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీమ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించి.. ఘన నివాళి అర్పిద్దామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. ఇందులో భాగంగా జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, భీమ్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీ నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారు. కొమురంభీమ్ వర్ధంతి అక్టోబర్ 8న జరగనున్న నేపథ్యంలో సోమవారం సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖమంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. జల్, జంగల్, జమీన్ పేరిట పోరాటం సాధించిన గిరిజన పోరాటయోధుడు కొమురం భీమ్ వర ్ధంతి సందర్భంగా జోడేఘాట్‌లో జరగబోయే కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం నిర్ణయించారు.

200 ఎకరాల్లో కొమురం భీమ్ పేరుతో మెమోరియల్ ఏర్పాటుచేయాలని దానికి వర్ధంతి రోజు శంకుస్థాపన చేస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం గల జిమ్‌కార్బెట్ నేషనల్ పార్కు తరహాలో కొమురం భీమ్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు, కొమురం భీమ్ చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ నిర్మించాలఆన్నరు. ప్రపంచ గిరిజన ఉత్సవాలు, భారతీయ గిరిజన సదస్సును కొమురం భీమ్ పేరుతో నిర్వహించాలని నిర్ణయించారు. ఇండియాకు కాశ్మీర్‌కు ఉన్నట్లే ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకు పై భాగంలో ఆకుపచ్చని అడవితో ఉంటుందని.. దాన్ని మరింత రమణీయంగా మార్చాలని పేర్కొన్నారు. కుంటాల జలపాతం, కవ్వాల్ వంటి వాటి విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు విమాన సౌకర్యం, రోడ్డు రవాణా సౌకర్యం మరింత మెరుగుపర్చాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement