
‘ఆర్మూర్’ఎక్స్‌అఫీషియో మెంబర్‌గా కవిత
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా కొనసాగడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన సమ్మతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజుకు ఫ్యాక్స్ ద్వారా శుక్రవారం పంపించారు.
తన సమ్మతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు ఫ్యాక్స్ చేసిన ఎంపీ
ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా కొనసాగడానికి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన సమ్మతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజుకు ఫ్యాక్స్ ద్వారా శుక్రవారం పంపించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూర్, బోధన్, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే ఎంపీ ఎక్స్ అఫీషియో మెం బర్‌గా కొనసాగడానికి అవకాశం ఉంది. దీంతో ఆర్మూర్ మున్సిపాలిటీలో1965 మున్సిపల్ చట్టం ప్రకారం ఎక్స్ అఫీషియో మెంబర్‌గా కొనసాగడానికి తన సమ్మతి పత్రాన్ని అందజేశారు.
మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా సమ్మతించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో 23 వార్డులుండగా చైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు చేయబడింది. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలను, టీఆర్‌ఎస్ 10 స్థానాలను, టీడీపీ, బీజేపీ చెరొక కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకున్నాయి. చైర్ పర్సన్ పీఠాన్ని టీఆర్‌ఎస్ వశం చేసుకోవడానికి బలం పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఎంపీ కవిత ఆర్మూర్‌లో ఎక్స్ అఫీషియో మెంబర్‌గా తన అంగీకారాన్ని తెలిపారు. ఇకపై ఆర్మూర్ మున్సిపాలిటీలో నిర్వహించే అధికారిక వ్యవహారాలన్ని ఎంపీకి కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
చైర్ పర్సన్ ఎన్నిక కంటే ముందే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సైతం మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో కొనసాగడానికి సమ్మతి పత్రం అందజేయాల్సి ఉంది. దీంతో మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ బలం 12కు చేరగా బీజేపీ కౌన్సిలర్ ద్యాగ ఉదయ్ కుమార్ ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపడంతో టీఆర్‌ఎస్ బలం 13కు చేరింది. ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయడానికి ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో మెంబరు ్లగా సమ్మతించడం కలిసి వచ్చే అంశంగా మారింది. ఎంపీ కవిత మెయిల్ చేసిన లేఖ తనకు అందినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు నిర్దారించారు. కమిషనర్‌తోపాటు పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం, కమిషనర్, డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లకు, రీజినల్ డెరైక్టర్ కం. అప్పిలేట్ కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణకు సమ్మతి పత్రాల ప్రతులను పంపించారు.