సీఎం దృష్టికి మానసిక వికలాంగుల సమస్య | hief attention to the problem of mental handicaps | Sakshi
Sakshi News home page

సీఎం దృష్టికి మానసిక వికలాంగుల సమస్య

Mar 14 2016 2:53 AM | Updated on Aug 9 2018 8:51 PM

సీఎం దృష్టికి మానసిక వికలాంగుల సమస్య - Sakshi

సీఎం దృష్టికి మానసిక వికలాంగుల సమస్య

మానసిక వికలాంగుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థికసాయం అందేలా

ఎంపీ వినోద్‌కుమార్
 
తిమ్మాపూర్ : మానసిక వికలాంగుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థికసాయం అందేలా చూస్తానని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. ఎల్‌ఎండీ కాలనీలో స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలోని మానసిక వికలాంగుల పాఠశాల రజతోత్సవాలు ఆదివారం ముగిశారుు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడారు. మానసిక వికలాంగులను అన్నివిధాలా తీర్చిదిద్దుతున్నా స్వాతంత్య్రసమరయోధులు అభినందనీయులన్నారు. అయతే, స్వచ్ఛంద సంస్థలు నిధులు దుర్వినియోగం చేస్తున్నాయనే కారణంతో మోదీ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. అయినా, త్వరలోనే పాఠశాల బడ్జెట్ ఇప్పిస్తానని మామీ ఇచ్చారు. మానసిక వికలాంగులు పుట్టకుండానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా మేనరికం వివాహాలు చేసుకోవద్దని, ఈవిషయంపై ప్రభుత్వాలు ఇప్పటికే విస్త­ృత ప్రచారం చేశాయన్నారు.

మంచిముహూర్తం పేరిట గడువు ముందు కొందరు ఆపరేషన్ల ద్వారా శిశువులకు జన్మనిస్తున్నారని, ఇలాంటివి సైతం మానసిక వైకల్యానికి దారితీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. పాఠశాలలో పని చేస్తున్న ఉద్యోగులకు త్వరలోనే శుభవారత వినిపిస్తానని చెప్పారు. కాగా, తాను డిజిటల్ సిస్టమ్స్, హార్డ్‌వేర్ అందిస్తానని అల్ఫోర్స్ కళాశాల చైర్మన్ నరేందర్‌రెడ్డి హామిచ్చారు. అనంతరం క్రీడా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈసందర్భంగా చేపట్టిన సాంస్క­ృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు.

ట్రస్టు అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జెడ్పీటీసీలు ఉల్లెంగుల పద్మ, తన్నీరు శరత్‌రావు, వైస్ ఎంపీపీ పొన్నాల భూలక్ష్మి, సర్పంచ్ మాతంగి స్వరూప, వైద్యుడు భూంరెడ్డి, కేడీసీసీబీ ఉపాధ్యక్షుడు ఉచ్చిడి మోహన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ పద్మావతి, ఉద్యోగ సంఘం నాయకులు లక్ష్మణ్‌రావు, మామిడి రమేశ్, గంగారపు రమేశ్, పోలు కిషన్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాంగోపాల్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు శేఖర్‌రావు,  స్వాతంత్య్ర సమరయోధులు, నాయకులు మధుసూదన్‌రావు, జనార్దన్‌రావు, వెంకటయ్య, ఎల్లారెడ్డి, బాపురెడ్డి, మల్లేశం, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement