రాజకీయాలకే సర్కార్ ప్రాధాన్యం | government gives priority only to politics, says ponnala | Sakshi
Sakshi News home page

రాజకీయాలకే సర్కార్ ప్రాధాన్యం

Aug 10 2014 1:16 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాజకీయాలకే సర్కార్ ప్రాధాన్యం - Sakshi

రాజకీయాలకే సర్కార్ ప్రాధాన్యం

టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతాంశాలను పక్కనబెట్టి కేవలం రాజకీయ అంశాలకు ప్రాధాన్యతనిచ్చి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శిం చారు.

టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
 
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతాంశాలను పక్కనబెట్టి కేవలం రాజకీయ అంశాలకు ప్రాధాన్యతనిచ్చి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శిం చారు. సుదీర్ఘ ఉద్యమచరిత్ర ఉన్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనన్నారు. క్విట్‌ఇండియా దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో పొన్నాల  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 1969 ఉద్యమంలో అనంతుల మదన్‌మోహన్, మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున్ తదితర కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావవంతంగా నడిపారని పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్ర విషయంలో ఎవరు ఎన్ని చెప్పుకొన్నా.. ప్రజలకు ఈ విషయం తెలుసునన్నారు. పరాయి పాలననుంచి విముక్తిని కలిగించి దేశ ప్రజలకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు కల్పించినది కాంగ్రెస్‌పార్టీనేనని గొప్పగా చెప్పుకునే అవకాశం తమకే ఉందన్నారు. దేశాన్ని పరాయిపాలన నుంచి విముక్తి కలిగించేందుకు క్విట్ ఇండియా ఉద్యమం నాంది పలికిందన్నారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న మాజీ మేయర్ లక్ష్మీనారాయణయాదవ్, గోపాల్‌కిషన్‌రావుల ను ఈ సందర్భంగా పొన్నాల సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వి.హనుమంతరావు, దానం నాగేందర్, అంజన్‌కుమార్‌యాదవ్, ఎం.కోదండరెడ్డి, టి.కుమార్‌రావు, కనుకుల జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement