గజ్వేల్‌లో ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.104.83 కోట్ల నిధులు విడుదల చేసింది.
స్కూల్, కాలేజీ భవనాల నిర్మాణం
సాక్షి, సంగారెడ్డి: గజ్వేల్‌లో ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ.104.83 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం స్పెషల్‌చీఫ్ సెక్రటరీ కె.ప్రదీప్‌చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పట్టణంలోని విద్యాసంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ఎడ్యుకేషనల్ హ బ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణ యం మేరకు గజ్వేల్‌లోని స్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలు, హాస్టళ్లను కలిసి ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద రూ.104.83 కోట్ల నిధులు మంజూరు చేశారు.
గజ్వేల్ పట్టణం సమీపంలో ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం రూ.146.28 కోట్ల నిధులు కావాలని కోరింది. బాలుర ఎడ్యుకేషనల్ హబ్ 73.04 కోట్లు, బాలికల ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం రూ.73.24 కోట్లతో కలెక్టర్ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి అందజే శారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం మొదట రూ.41.45 కోట్లు నిధులను విడుదల చేసింది. తాజాగా ప్రభుత్వం మరో రూ.104.83 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.