అంతిమసంస్కారాల కోసం... | For the funeral ... | Sakshi
Sakshi News home page

అంతిమసంస్కారాల కోసం...

Nov 7 2015 11:28 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఆత్మహత్య చేసుకున్న రైతు కూలీ.

ఇంటి పెద్ద చనిపోతే ఖర్మకాండలకు అవసరమైన డబ్బు కూడా యాచించాల్సిన స్థితి.. ఇదేదో..  ఫుట్ ఫాత్ మీద బ్రతికే అభాగ్యుల పరిస్థితి కాదు..నేటి అన్నదాత దైన్యం..


ఈ స్థితిని కళ్లకు కట్టింది కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో శనివారం  జరిగిన ఘటన. గ్రామానికి చెందిన గొర్రె ఓదేలు(40) వ్యవసాయ కూలీగా పనిచేసుకుని జీవనం సాగిస్తుండే వాడు. ప్రస్తుతం వ్యవసాయం చేయడమే సాహసంగా భావిస్తున్న రైతన్నలు కూలీలతో పనిచే యించుకునేంత ధైర్యం చేయలేక పోతున్నారు. దీంతో కూలిపని దొరక్క తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓదేలు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేక పోవడంతో గ్రామస్థులంతా కలిసి చందాలు సేకరిస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement