సాగులో సాంకేతిక పద్ధతులు అవలంబించాలి | Focus on farming techniques | Sakshi
Sakshi News home page

సాగులో సాంకేతిక పద్ధతులు అవలంబించాలి

Aug 9 2014 3:20 AM | Updated on Sep 2 2017 11:35 AM

శాస్త్రవేత్తలందరూ 5 బృందాలుగా విడిపోయి, గ్రామ పరిధిలోని పొలాలకు వెళ్లారు. ఎక్కడ ఏ భూములున్నాయి, ఏ పంటలు వేశారు, అక్కడ ఎలాంటి వనరులున్నాయి వంటి అంశాలను జీపీఎస్ ద్వారా గుర్తించారు.

శాస్త్రవేత్తలందరూ 5 బృందాలుగా విడిపోయి, గ్రామ పరిధిలోని పొలాలకు వెళ్లారు. ఎక్కడ ఏ భూములున్నాయి, ఏ పంటలు వేశారు, అక్కడ ఎలాంటి వనరులున్నాయి వంటి అంశాలను జీపీఎస్ ద్వారా గుర్తించారు. పనికిరాని మొక్కలనుకునేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, సంప్రదాయ పంటసాగు విధానం నుంచి ఆధునిక సాంకేతిక సాగుపై డాక్యుమెంటరీకి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. మట్టి నమూనాలను సేకరించి, అందులో అధికంగా ఉన్న పోషక లోపాలను గుర్తించారు.
 
పత్తి పంట సాగుపై ఆరా
 
పత్తిపంటను ఎందుకు సాగు చేస్తున్నారని, ఎలాంటి విత్తనాల ఎంపిక చేసుకుంటున్నారు, ఆశించే రోగాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాన్ని  శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం రైతులతో కలిసి శాస్త్రవేత్తలు సమావేశం నిర్వహించారు. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంపై రైతులు అడిగిన  ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలిచ్చారు.

ఆముదం, కంది, పెసర, కుసుమ పంటలు సాగు చేయాలని శాస్త్రవేత్తలు సూచించగా, ఆ పంటలు లాభసాటిగా లేవని, పత్తి పంట లాభసాటిగా ఉందని వివరించారు. సాగు నీరు, కరెంటు అందిస్తే ప్రభుత్వం ఏ రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదని నెల్లికంటి బాబు అనే రైతు శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లాడు. విద్యాశేఖర్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ పత్తి విత్తనాలు 50మి.మీ.లకు పైగా వర్షం కురిసినప్పుడే విత్తాలన్నారు. లేకపోతే పత్తి పంట తొందరగా బెట్టకొస్తుందన్నారు. మరికొంత మంది శాస్త్రవేత్తలు కందులు నాటే విధానం, వరిసాగు వెదజల్లే విధానం, మెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకునే విధానాన్ని వివరించారు.
 
69 వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలకు శిక్షణ

 
సీనియర్ శాస్త్రవేత్త కె.హనుమంతరావు మాట్లాడుతూ దేశంలోనే 69 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలకు నార్మ్ శిక్షణ ఇస్తుందన్నారు. యువ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసేందుకు దేశంలో 12 గ్రామీణ ప్రాంతాలను గుర్తించామన్నారు. వారు అక్కడి గ్రామాల్లో 3 వారాల పాటు పరిశోధనలు చేస్తారన్నారు. దీని ద్వారా వ్యవసాయంపై నూతన ప్రణాళికలు రూపొందించడానికి ఉపయోగపడుతు ందన్నారు. శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చేది దేశంలో నార్మ్ మాత్రమేనన్నారు. అనంతరం పాఠశాలలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బృందం హెడ్ డాక్టర్ సంధ్యాషైనా, సీనియర్ శాస్త్రవేత్తలు వీకే.జయరావు, పద్మయ్య, సతీష్, షేక్‌మీరా, కో-ఆర్డినేటర్ సొట్టంకె, తమ్మరాజా, వెంకటేశం, వెంకట్‌కుమార్, సూర్య రాథోడ్ ,గ్రామా సర్పంచ్ ఎర్ర మల్లేష్, ఏఓ శ్రీనివాస్‌లు,  ఏఈఓ నర్సింహ తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement