రైతుల ఐడియా అదిరింది | Farmers Idea was super | Sakshi
Sakshi News home page

రైతుల ఐడియా అదిరింది

Dec 17 2016 12:48 AM | Updated on Oct 1 2018 2:09 PM

రైతుల ఐడియా అదిరింది - Sakshi

రైతుల ఐడియా అదిరింది

నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌ప ల్లిలో విద్యుత్‌ మోటార్‌ పంపుసెట్టు అవసరం లేకుండానే

షట్టర్‌ పనిచేయకపోతేనేం... ∙ వినూత్న పద్ధతిలో చెరువునీరు వినియోగం

కమ్మర్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలోని చౌట్‌ప ల్లిలో విద్యుత్‌ మోటార్‌ పంపుసెట్టు అవసరం లేకుండానే చెరువులోని నీటిని తోడుకోవడానికి ఆయకట్టు రైతులు వినూత్న ప్రక్రియ చేప ట్టారు. ఊర చెరువు తూం షెట్టర్‌ పని చేయకపోవడంతో మరమ్మతు లు చేపట్టడానికి వీలులేకుండాపోయింది. దీంతో యాసంగికి నీరం దడం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో  రైతులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలసి ప్రత్యామ్నాయం ఆలోచించి అమలు చేశారు. 4 అంగులాల 12 పైపులను రెండు వరుసలుగా చేసి ఒక చివరను చెరువులోకి, మరో చివరను కట్ట మీదుగా తూము వైపు ఉన్న పంట కాలువ లోకి వేశారు.

చెరువులో దింపిన పైప్‌లైన్‌కు ఒక కం ట్రోల్‌ వాల్వ్, అవతలి వైపునకు మరొక కంట్రోల్‌ వాల్వ్‌ బిగించారు. కట్ట మీదుగా ఉన్న పైప్‌లైన్‌కు ఒక చోట మూడు రంధ్రాల (టీ) పరికరాన్ని బిగించారు. రెండు కంట్రోల్‌ వాల్వులకు మూత బిగించి, ’టీ’ పరికరం ద్వారా పైప్‌లైన్‌లోకి నీరు (ఇరవై బకెట్లు) పోశారు. పోసిన నీరు పైపుల్లోంచి రెండు వైపులా చేరగానే (నిండగానే) కంట్రోల్‌ వాల్వులను ఒక్కసారిగా తెరిచారు. వెంటనే చెరువులోని నీరు పైప్‌లైన్‌ల ద్వారా పంట కాలువలోకి వచ్చేసింది. విద్యుత్‌ మోటార్‌ పంపుసెట్టు ఏవిధంగా అయితే ఒత్తిడితో పోస్తుందో అంతే వేగంగా కరెంట్, యంత్రం లేకుండానే నీరు పోస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement