Sakshi News home page

మిర్చికి ధర లేదని రైతు ఆత్మహత్య

Published Sun, Apr 9 2017 2:33 AM

మిర్చికి ధర లేదని రైతు ఆత్మహత్య - Sakshi

- ఎనిమిది ఎకరాల్లో సాగు
- పెట్టుబడికి రూ.ఐదు లక్షల అప్పు


భూపాలపల్లి రూరల్‌: మిర్చికి గిట్టుబాటు ధర రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు చేనులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్‌ భూపాలపల్లిలోని జం గేడుకు చెందిన రైతు దొంగల సారయ్య(55) ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి వేశాడు. సాగు కోసం రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. 9 విడతలుగా పది క్వింటాళ్ల మిర్చి అమ్మగా.. రవాణా ఖర్చులు పోను రూ. 30 వేలు మిగిలాయి. మరో 30 క్వింటాళ్ల మిర్చి కల్లంలోనే ఉంచి ధర కోసం ఎదురు చూస్తున్నాడు. రోజులు గడుస్తున్నా.. ధర పెరగకపోవడంతో భోజనం కూడా సరిగా చేయలేదని కుటుంబసభ్యులు చెప్పారు. గతేడాది కూతురి పెళ్లి కోసం చేసిన అప్పులు , వడ్డీలకు ఈ ఏడాది మిర్చి పంట కోసం తెచ్చిన అప్పు తోడవడంతో సారయ్య ఆందోళనకు గురై నట్లు తెలిపారు. దీంతో శని వారం మధ్యాహ్నం  మిర్చి తోట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్‌కు తరలి స్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.

తాండూరులో మరో రైతు..
తాండూరు(నాగర్‌కర్నూలు): నాగర్‌కర్నూలు జిల్లా తాండూరు మండలం చర్లతిర్మలాపూర్‌ కు చెందిన రైతు గంజాయి అడిమయ్య(40) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అడిమయ్య 8 ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి వేశాడు. వర్షాభావంతో పంటలు ఎండి పోయాయి.  రూ. 5 లక్షల వరకు ఉన్న అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో మన స్తాపంతో శనివారం  బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
Advertisement