అప్పులు తీర్చలేక...రైతు ఆత్మాహుతి | farmer commits suice due to financial crises | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చలేక...రైతు ఆత్మాహుతి

Mar 8 2015 10:15 PM | Updated on Nov 6 2018 7:56 PM

వ్యవసాయం కలసి రాలేదు.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరలేదు.. దీంతో విసిగివేసారిన ఓ రైతు నిప్పంటించుకుని సజీవ దహనమయ్యాడు.

బొంరాస్‌పేట(మహబూబ్‌నగర్): వ్యవసాయం కలసి రాలేదు.. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరలేదు.. దీంతో విసిగివేసారిన ఓ రైతు నిప్పంటించుకుని సజీవ దహనమయ్యాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట మండలం పోలెపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కోస్గి పెద్ద ఇస్వప్ప (50)కు రెండెకరాల పొలం ఉంది. బోరు సౌకర్యం ఉన్న ఆ పొలంలో వేరుశెనగ వేశాడు. సాగు పెట్టుబడి కోసం రూ.50వేలు అప్పు చేశాడు.

 

కాగా, బోరులో నీరు అడుగంటుతోంది. కేవలం 4బస్తాల పంట దిగుబడి రావడంతో అప్పులు తీర్చే దారి కానరాక మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement