రెండేళ్లలో పార్టీ ఫిరాయింపులకే ప్రోత్సాహం | Encouraged by two years Defection | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో పార్టీ ఫిరాయింపులకే ప్రోత్సాహం

Jun 2 2016 2:55 AM | Updated on Sep 4 2017 1:25 AM

రెండేళ్లలో పార్టీ ఫిరాయింపులకే ప్రోత్సాహం

రెండేళ్లలో పార్టీ ఫిరాయింపులకే ప్రోత్సాహం

తెలంగాణ సర్కార్ రెండేళ్లకాలంలో ఇతరపార్టీల ముఖ్య నేతలను టీఆర్‌ఎస్‌లోకి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని.....

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి

ముకరంపుర: తెలంగాణ సర్కార్ రెండేళ్లకాలంలో ఇతరపార్టీల ముఖ్య నేతలను టీఆర్‌ఎస్‌లోకి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్‌లో బుధవారం జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉన్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని పేర్కొన్నారు. అప్పులు మరింత పెరిగి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందన్నారు.

ఉచితంగా విత్తనాలు, పశుగ్రాసం అందించాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నాయకులు కర్రె భిక్షపతి, ఎం.నారాయణ, బోయిని అశోక్, ఎన్.రామన్న, తాళ్లపెల్లి లక్ష్మణ్, కూనశోభారాణి, కేదారి, పైడిపల్లి రాజు, అందెస్వామి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement