తాగిన మైకంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. కన్నతల్లిని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ముక్కుడు దేవిపల్లి గ్రామంలో జరిగింది.
తాగిన మైకంలో ఓ వ్యక్తి విచక్షణ కోల్పోయాడు. కన్నతల్లిని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ముక్కుడు దేవిపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు బయ్యా బక్కమ్మ (50)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆదివారం పీకలదాకా తాగి ఇంటికి వచ్చాడు. తల్లితో గొడవ పడి ఆమె తలపై బండరాయితో మోదాడు. తీవ్రంగా గాయపడిన బక్కమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.