10 గంటల్లో వైరస్‌ కట్టడి

Coronavirus will kill if we increase immunity - Sakshi

నిరోధక శక్తి పెంచుకుంటే కరోనాకు కళ్లెం 

మందు, వ్యాక్సిన్‌ కోసం కాకుండా ఈ దిశలో ఆలోచించాలి 

అక్టోబర్‌ నాటికి మళ్లీ విజృంభించే ప్రమాదం 

అపర సంజీవనులు మన చుట్టూనే ఉన్నాయి 

సాక్షి, హైదరాబాద్‌: ’సార్స్, మెర్స్, కరోనా (కోవిడ్‌).. ఇవన్నీ బీటా రకానికి చెందిన ప్రమాదకర వైరస్‌లు. ఇప్పుడు కరోనా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. దీన్ని నిరోధించేందుకు అల్లోపతిలో ఇప్పటికిప్పుడు సిద్ధంగా మందు లేదు.. నిరోధించే వ్యాక్సిన్‌ లేదు. మరి దీన్ని ఇలాగే వదిలేయాలా? అనవసరంగా భయపడకుండా, మన ముందున్న అద్భుత అవకాశాలను వినియోగించుకోవాలి. మనకున్న గొప్ప వరం.. వ్యాధి నిరోధక శక్తి. దీన్ని ఇప్పుడు రామబాణంలా వాడుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటం ద్వారా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా ప్రవేశ మార్గం వద్దే కట్టడి చేయొచ్చు. అయినా దాటుకుని లోనికి వెళ్లినా, అది లైఫ్‌ సైకిల్‌ను ఏర్పాటు చేసుకునేలోపే తుదముట్టించొచ్చు. సరిగ్గా చెప్పాలంటే 8 నుంచి 10 గంటల్లోనే దాన్ని కట్టడి చేసేయొచ్చు. అంతరాల్లోకి ప్రవేశించినా, మూడు, నాలుగు రోజుల్లో దాన్ని జయించొచ్చు. అలా వ్యాధినిరోధక శక్తిని పటిష్టం చేసే సంజీవని లాంటి అద్భుత వనరులు మన వద్ద ఉన్నాయి. వాటిని గుర్తించి వాడుకోవటమే తరువాయి’అని ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ స్పెషలిస్టు, మైక్రోబయాలజిస్టు డాక్టర్‌ దుర్గా సునీల్‌ వాస వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

వెంటనే అప్రమత్తం కావాలి.. 
ఇతర దేశాలవారితో పోలిస్తే భారతీయుల వ్యాధి నిరోధక శక్తి గొప్పది. మన సంప్రదాయంలోనే ఆ రహస్యం దాగి ఉంది. మన ఇమ్యూనిటీని పటిష్టం చేయటం ద్వారా అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన కరోనా వైరస్‌ను అరికట్టే అవకాశం ఉంది. ఆ వైరస్‌ మన శరీరంలోకి చేరిన తర్వాత దాన్ని చంపేసే మందుకోసం ఎదురు చూడకుండా, కొత్త వారిలో ఆ వైరస్‌ వ్యాపించకుండా నిరోధించే వ్యాక్సిన్‌ వచ్చే వరకు దిక్కులు చూడకుండా ఇప్పుడు వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.  

కొద్ది నెలల్లో మళ్లీ విజృంభించొచ్చు.. 
సాధారణంగా చాలా వైరస్‌లు ఒకసారి వచ్చి ప్రతాపం చూపిన తర్వాత, కొద్ది కాలానికే మళ్లీ ప్రత్యక్షమై అంతకంటే ఎక్కువ నష్టం చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలా వైరస్‌లు ఇలా చేసినవే. ఇప్పుడు బలంగా విస్తరిస్తున్న కరోనా కూడా ప్రస్తుతానికి లొంగినట్లు కనిపించినా.. అక్టోబర్‌ సమయంలో మళ్లీ కనిపించే అవకాశం ఉంది. వైరస్‌కు, ఎండ తీవ్రతకు సంబంధం ఉందా అన్న విషయం పక్కన పెడితే, సాధారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాని ప్రభావం తక్కువ ఉండొచ్చు. అక్టోబర్‌ లో వేడి కూడా తక్కువ. చల్లటి వాతావరణంలో మరింత వేగంగా విస్తరించవచ్చు. అప్పటి వరకు సరైన మందు, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకుంటే, దేవుడిపై భారం వేసి ఎదురుచూడటమేనా..? కాదు.. అందుబాటులో ఉన్న అద్భుత వనరులను వినియోగించుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వైరస్‌ను గొప్పగా నియంత్రించే అవకాశం ఉంటుంది.  

‘హెస్పెరిడిన్‌ రసాయనం’అమృతం 
► సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను తింటే వైరస్‌ను నిరోధించొచ్చని మనం వింటున్నాం. చాలా మంది ఇది విటమిన్‌ సి ప్రభావంగా భావిస్తున్నారు. కానీ కొన్ని రకాల పండ్లలో ఉండే హెస్పెరిడిన్‌ రసాయనమే దానికి కారణం.
► నారింజలాగే అనిపిస్తూ ఆకృతిలో పెద్దగా ఉండే దబ్బకాయలో ఇది బాగా ఉంటుంది. నారింజ, బత్తాయిల్లో కొంత తక్కువ మోతాదులో ఉంటుంది. ఆ తర్వాత నిమ్మలో కూడా కొంతమేర ఉంటుంది. కరోనా వైరస్‌కు ఉండే స్పైక్స్‌ (కొమ్ములు లాంటివి) మన శరీరంలో ఉండే ఏసీఈ 2 ఎంజైమ్‌తో జత కలసి లోపలికి ప్రవేశించే అవకాశాన్ని నిరోధిస్తుంది.
► ఉసిరికాయ కూడా అద్భు తంగా పనిచేస్తుంది. ఇందులో హెస్పెరిడిన్‌ ఉండదు కానీ, వైరస్‌ స్పైక్స్‌ మెత్తబడేలా చేస్తుంది. ఫలితంగా అది మనలోకి ప్రవేశించే అవకాశం ఉండదు.  
► గ్రీన్‌ టీ ఇప్పుడు ఎంతో ఉపయోగం. గ్రీన్‌ టీలో ఉండే క్వార్సిటీన్‌ రసాయనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పని చేసి వైరస్‌ లోనికి చేరకుండా నిరోధిస్తుంది. 

ఆ మందులు ఎంతో మేలు.. 
వైరస్‌ మన శరీరంలోకి వెళ్లకుండా నిరోధించటంలో రోగ నిరోధక శక్తి విఫలమైనా.. లోనికి వెళ్లాక అది విపరీతంగా పెరిగిపోయే గుణాన్ని నిరోధించేందుకు ఉపయోగపడే మందులు కొన్ని ఇప్పటికే హోమియో, ఆయుర్వేదంలో ఉన్నాయి. భూనింబగా పిలుచుకునే నేలవేము, వావిలి ఆకు గుణాలతో రూపొందించిన మందులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్‌ లోపలికి వెళ్లిన తర్వాత దానిపై పోరాడే క్రమంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ఇంటర్‌లుకింగ్‌ 1బి, ఇంటర్‌ లుకింగ్‌ 18 అనే ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్‌ ను విడుదల చేస్తాయి. ఇది న్యుమోనియా రావటానికి కారణమవుతుంది. ఇక్కడే ఆ మందులు అద్భుతంగా పనిచేస్తాయి. న్యుమోనియా రాకుండా కట్టడి చేస్తాయి. అసలు కరోనా వైరస్‌ మన శరీరంలోని డీఎన్‌ఏను ఆక్రమించుకుని సొంతంగా తన లైఫ్‌ సర్కిల్‌ను ప్రారంభించటాన్ని నిరోధించగలిగే శక్తి వీటికి ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top