సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసుయంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
నల్లగొండ క్రైం/నకిరేకల్ : సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసుయంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉదయం 11:30 గంటలకు బండారు గార్డెన్‌లో జరగనున్న ముషంపల్లి గ్రామానికి చెందిన రైతు బోర్ల రాంరెడ్డి కుమారుడు కృష్ణారెడ్డి వివాహానికి సీఎం హాజరవుతున్నారు. అనంతరం 12:15 నుంచి 12:45 వరకు నకిరేకల్ మండలం చందుపట్లలో నిర్వహించే మిషన్ కాకతీయ పనుల్లో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లను న్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్జీ కాలేజీలో హెలీప్యాడ్ స్థలాన్ని మార్కింగ్ చేశారు.
సీఎం వెళ్లే ప్రాంతాలను రూట్ మ్యాప్‌ను ఏర్పాటు చేసుకుని ఇందుకు తగ్గట్టుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారుగా 600 మంది పోలీ సులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎన్జీ కాలేజీ నుంచి బండారు గార్డెన్‌కు ప్రత్యేక వాహనంలో వెళ్లి వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం వెళ్లే ఫంక్షన్‌హాల్‌కు పోలీసులు ట్రయల్న్‌గ్రా బందోబస్తు నిర్వహించారు. ఏ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఎక్కడ ఎంత మంది భద్రతా సిబ్బందిని నియమించాలో గుర్తించారు. డీఎస్పీలు -7, సీఐలు -30, ఎస్‌ఐలు - 60 మంది బందోబస్తులో పాల్గొంటున్నారని ఏఎస్పీ గంగారాం వివరించారు.