చంద్రబాబుకు అంతసీన్ లేదు | Chandrababu to does not have so Sean - kishan reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు అంతసీన్ లేదు

Nov 16 2014 12:24 AM | Updated on Mar 29 2019 9:24 PM

చంద్రబాబుకు  అంతసీన్ లేదు - Sakshi

చంద్రబాబుకు అంతసీన్ లేదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చురకలేశారు.

మోదీని ప్రభావితం చేయలేరు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చురకలేశారు. శనివారం అసెంబ్లీ వెలుపల ఆయన విలేకరులతో ముచ్చటించారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు చంద్రబాబే మంత్రి పదవి ఇప్పించారట కదా? అన్న ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు. ‘ చంద్రబాబుకు అంత సీన్ లేదు. అయినా, ప్రధాని మోదీని ప్రభావితం చేయలేరు. బాబు మాటలు వినే స్థితిలో ప్రధాని మోదీ లేరు.  పార్టీలో ఓ స్థాయిలో ఉన్న నేతలు సైతం ఆయన్ను కలిసి చెప్పలేరు..’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీకి రెండు మంత్రి పదవులు వెళ్లాయంటే, అక్కడ పరిస్థితులు, ఎంపీల సంఖ్యను బట్టే అని వివరించారు. రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే ఎంపీ సీటు, అయినా, ఉన్నంతలో మంచి పదవే దక్కింది. స్వతంత్ర బాధ్యతలతో మంత్రి పదవి వచ్చింది  కదా? అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement