రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సిద్ధాంతి వద్ద గురువారం అర్ధరాత్రి ఓ లారీ కారును ఢీకొంది.
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సిద్ధాంతి వద్ద గురువారం అర్ధరాత్రి ఓ లారీ కారును ఢీకొంది. కట్టెల లోడుతో వెళుతున్న లారీ 1 గంట సమయంలో కారును ఢీకొనగా మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలూ దగ్ధం అయ్యాయి. అయితే, కారులో ఎవరూ లేకపోవడం, డ్రైవర్లు కిందకు దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.