గడీల పాలనకు గండికొట్టాలి

Bandi Sanjay Kumar Fires On KCR In karimnagar meeting - Sakshi

కళాకారులకు అండగా ఉంటా

ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ 

సాక్షి, కరీంనగర్‌:  కళాకారులు కాలికి గజ్జెకట్టి తమ పాటలతో మలి దశ ఉద్యమానికి నాంది పలికి కేసీఆర్‌ గడీల పాలనకు గండికొట్టాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్‌లో సోమవారం జాగో తెలంగాణ, తెలంగాణ కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కళా కారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కళాకారులు కాలికి గజ్జె కట్టి తమ పాటలతో మలి దశ ఉద్యమానికి నాంది పలికి కేసీఆర్‌ గడీల పాలనకు గండికొట్టాలని ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. నగరంలోని రెవెన్యూ గార్డెన్‌లో జాగో తెలంగాణ, తెలంగాణ కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కళాకారుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నిధులు, నియామకాలు లేక, కళాకారుల ఆకలికేకలతో, ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ ప్రజల, తెలంగాణ తల్లి ఆత్మ ఘోషిస్తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారులకు అండగా ఉంటానన్న కేసీఆర్‌ ఇప్పుడు కళాకారుల పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఫెడరేషన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, కళాకారులంతా కలిసికట్టుగా ఉద్యమించి కేసీ ఆర్‌ను గద్దె దించాలన్నారు. పార్టీలకతీతంగా హక్కుల కోసం చేసే ఉద్యమంలో తాను కళాకా రులకు ఉండగా ఉంటుందన్నారు. ఎంపీగా నా గెలుపులో కళాకారుల పాత్ర గొప్పదని, పార్టీల జెండాతో కాకుండా కళాకారుల జెండా కింద తాము అందరం పని చేస్తామన్నారు.

జాగో తెలంగాణ కన్వీనర్‌ జిట్టా బాలక్రిష్టారెడ్డి మాట్లాడుతూ కవులు కళాకారులు కంటతడి పడితే ఆ రాజ్యం ఎక్కువ కాలం ఉండదన్నారు. యువ తె లంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణి రుద్ర మ మాట్లాడుతూ జై తెలంగాణ అన్న వారికి  కాకుండా నైహీ తెలంగాణ అన్న వారికి నేడు మంత్రి వర్గంలో చోటు దక్కిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, తెలంగాణ కళాకారుల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఓరుగంటి శేఖర్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు దరువు ఎల్లన్న, వివిధ జిల్లాల  కళాకారులు, నాయకులు కసర్ల ఐలయ్య, వెంకటేశం, ఐలోజు  పాల్గొన్నారు.
బెజ్జంకి మండలాన్ని  

కరీంనగర్‌లో కలపాలి
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా బెజ్జంకి మండలాన్ని సిద్దిపేటలో కలిపారని, తిరిగి మళ్లీ కరీంనగర్‌లో కలపాలని బెజ్జంకి అఖిల పక్షం నాయకులు  ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ కలసి వినతి పత్రం సమర్పించారు. వినతిపత్రం ఇచ్చిన వారి లో రవి, మధు, వెంకటేశ్వర రావు, శానగొండ శరత్‌ తదితరులున్నారు..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top