శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి పోలీస్‌స్టేషన్ భద్రత విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు.
భామిని: శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి పోలీస్‌స్టేషన్ భద్రత విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎంవీ అజారుద్దీన్(29) 5వ బెటాలియన్ హెచ్ కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావటంతో వెంటనే కొత్తూరు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు.