
ఏపీకి కలెక్టర్ కేటాయింపు
జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తూ డీవోపీటీ తుది ఉత్తర్వులు వెల్లడించింది
అయినా తెలంగాణకు వచ్చే అవకాశం జిల్లా కలెక్టర్‌గా కొనసాగే చాన్స్ తుది ఉత్తర్వులు వెలువరించిన డీఓపీటీ ప్రస్తుతం సెలవులో వాకాటి కరుణ
హన్మకొండ అర్బన్ : జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తూ డీవోపీటీ తుది ఉత్తర్వులు వెల్లడించింది. గురువారం వెలువడిన ఉత్తర్వుల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల కేటాయింపులు చేశారు. అందులో ప్రస్తుతం తెలంగాణకు కేటాయించిన వారిలో కొందరు ఆంధ్రాకు, ఆధ్రావారు తెలంగాణకు మారారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు మారిన వారిలో కలెక్టర్ కరుణ కూడా ఉన్నారు. కరుణను జిల్లాకు కలెక్టర్‌గా బదిలీ చేస్తూ జనవరి 11న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులో జారీ చేసింది. జనవరి 18న కరుణ కలెక్టర్‌గా బా ధ్యతలు స్వీకరించారు. అయితే సరిగ్గా రెండున్న నెలల్లో కలెక్టర్ ఆంధ్రాకు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
తెలంగాణ కోసం..
రాష్ట్ర విభజన అనంతరం అధికారులకు రాష్ట్రా ల కేటాయింపు సమయంలో కూడా కరుణ ఆంధ్రాకు వెళతారని అంతా అనుకున్నారు. ప్రాథమిక కేటాయింపుల్లో ఆదే జరిగింది. అ యితే తాను హైదరాబాదీనని, తెలంగాణకు చెందినందున తనను తెలంగాణ కు కేటాయిం చాలని కోరుతూ ఐఏఎస్ పంపకాల కోసం ఏర్పాటైన ప్రత్యూష సిన్హా కమిటీకి విన్నవించారు. తరువాత కరుణను తెలంగాణకు కేటాయించారు. అయితే అవన్నీ పూర్తిస్థాయి ఉత్తర్వులు కాదు. ప్రస్తుతం తుదిజాబితాలో మాత్రం కరుణ పేరు ఆంధ్రాకు కేటాయించిన జాబితాలో ఉంది.
తెలంగాణకే వచ్చే అవకాశం
ప్రత్యూష్ సిన్హా కమిటీకి ఇచ్చిన వివరాలు, విన్నపాల ఆధారంగా కరుణ తెలంగాణకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆదే భరోసాతో ప్రభుత్వం జిల్లాకు కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు మారిన అధికారులకు తాము కోరుకున్న రాష్ట్రంలో పనిచేసేందుకు ఇతర మార్గాల ద్వారా కూడా ప్రయత్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం సెలవులో..
ప్రసుత్తం మార్చి 2 నుంచి కలెక్టర్ కరుణ సెలువులో ఉన్నారు. ఈ నెల 17 వరకు చైల్డ్ కేర్ లీవ్‌లో వెళ్లారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా మహానగర పాలకసంస్థ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ కొనసాగుతున్నారు.