తమ పిల్లల విషయంలో ఇలా చేయగలరా? | Anjani Kumar Tweet on Pet Dogs Leave on Roads in Hyderabad | Sakshi
Sakshi News home page

‘పెంపుడు శునకాలను వదిలేస్తే నేరమే’

Jul 20 2020 8:33 AM | Updated on Jul 20 2020 10:01 AM

Anjani Kumar Tweet on Pet Dogs Leave on Roads in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అనేక మంది పెంపుడు శునకాలను రోడ్లపై వదిలేస్తున్నారని, ఇది అమానవీయమైన చర్య అని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్‌ చేశారు. ఎవరైనా తమ పిల్లల విషయంలో ఇలా చేయగలరా? అంటూ ప్రశ్నించారు. తమను పెంచుకునే కుటుంబంపై ఆయా శునకాలు అన్ని విధాలా ఆధారపడి ఉంటాయని, వాటి విషయంలో అమానవీయంగా వ్యవహరించకూడదని సూచించారు. అలా చేయడం శునకాల పట్ల క్రూయల్‌గా వ్యవహరించడమేనని, ఇది చట్ట ప్రకారం నేరమని సీపీ తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement