రేపు ఎంసెట్ ఏసీ ఫలితాలు | AC results tomorrow EAMCET | Sakshi
Sakshi News home page

రేపు ఎంసెట్ ఏసీ ఫలితాలు

Jun 3 2015 12:35 AM | Updated on Oct 9 2018 7:52 PM

యాజమాన్య కోటా వైద్య సీట్లకు ఈ నెల 30న జరిగిన ఎంసెట్ ఏసీ (అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్) ఫలితాలు గురువారం

కౌన్సెలింగ్‌కు ముగ్గురు సభ్యులతో కమిటీ

హైదరాబాద్: యాజమాన్య కోటా వైద్య సీట్లకు ఈ నెల 30న జరిగిన ఎంసెట్ ఏసీ (అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్) ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. పరీక్షకు 6,600 మంది దరఖాస్తు చేసుకోగా 5,738 మంది రాశారు. మొత్తం 700 సీట్లు యాజమాన్య కోటాలో భర్తీ చేయనున్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిశాక ఎంసెట్ ఏసీ కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ అధికారి ‘సాక్షి’తో చెప్పారు.

మెరిట్ ప్రాతిపదికన సీట్లు పొందిన అభ్యర్థులు ఏడాదికి రూ.11 లక్షల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ వర్శిటీ వైస్ చాన్స్‌లర్, వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ), ప్రైవేటు యాజమాన్యాల అసోసియేషన్ నుంచి ఒకరుగాగల త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలోనే సీట్ల భర్తీ జరుగుతుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement