వరంగల్ రైల్వేస్టేషన్‌లో శనివారం 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ రైల్వేగేట్: వరంగల్ రైల్వేస్టేషన్‌లో శనివారం 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. త్రివేండ్రం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళా ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా వెండి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దిశగా తనిఖీలు చేపట్టారు.
తమిళనాడులోని సేలంకు చెందిన నటరాజన్ కేరళా నుంచి వరంగల్‌కు వెండి వస్తువులు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని 68 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం విచారణ చేపడుతున్నారు.